అనంతపురం జనసేన మహిళా కార్యాలయంలో ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

  • రాష్ట్ర సంక్షేమం, ప్రజా శ్రేయస్సు కేసం అవతరించిన పార్టీ జనసేన

అనంతపురం: జనసేన పార్టీ మహిళా కార్యాలయం అనంతపురం నందు జనసేన పార్టీ 11వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను రాయలసీమ రీజినల్ ఉమెన్ కో-ఆర్డినేటర్ పెండ్యాల శ్రీలత ఘనంగా నిర్వహించారు. ముందుగా కార్యాలయంలో ఏర్పాటు చేసిన కేకును కట్ చేసి అనంతరం ఆమె మాట్లాడుతూ రాష్ట్ర సంక్షేమం ప్రజాశ్రేయస్సు ప్రజల పక్షాన బలంగా నిలబడడానికి ఏర్పడిన పార్టీనే జనసేన పార్టీ అని పార్టీ అవిర్భవించి ఒక దశాబ్దం పూర్తి ఔతుందని ఈ 10సంవత్సారాల కాలంలో అనేక ప్రజా పోరాటాలు, సేవా కార్యక్రమాలు ప్రజా ఉపయోగ కార్యక్రమాలు చేస్తూ ఎప్పటికప్పుడు ప్రజల మన్నలను పొందుతున్న పార్టీ జనసేన పార్టీ అని పవన్ కళ్యాణ్ ఎటు వంటి తన వ్యక్తిగత ప్రయోజనాలను ఆశించకుండా పార్టీని స్థాపించి తన జీవితాన్నే ప్రజలకు అంకితం చేశారని ఆయన అడుగుజాడలలో నడుస్తూ ప్రజల పక్షాన నిలుస్తున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉందని రాబోయే కాలంలో ఉమ్మడి ప్రభుత్వ ఏర్పాటులో జనసేన పార్టీది ప్రధాన మైన భూమిక ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో వీరమహిళలు, జనసేన నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొనడం జరిగింది.