రెండు కోట్ల 71 లక్షల రూపాయలతో నిర్మించిన 6 వాటర్ ట్యాంకుల ప్రారంభోత్సవం.!

రాజోలు మండలంలో రెండు కోట్ల 71 లక్షల రూపాయల జలజీవన్ మిషన్ నిధులతో నూతనంగా నిర్మించిన ఆరు వాటర్ ట్యాంకులను గౌరవ శాసనసభ్యులు దేవ వరప్రసాద్ ప్రారంభోత్సవం చేసి ప్రజలకు అంకితం చేశారు అవి

  1. శివకోడు- 120 కె.ఎల్
  2. రాజోలు – 60 కె.ఎల్
  3. పొదలాడ – 40 కె.ఎల్
  4. బి.సావరం- 40 కె.ఎల్
  5. కడలి సెంటర్ – 40 కె.ఎల్
  6. కడలి వాసంశెట్టి వారి గ్రూప్ – 40 కె.ఎల్

ఈ సందర్భంగా గౌరవ శాసనసభ్యులు మాట్లాడుతూ రాజోలు నియోజకవర్గం గత రెండు దశాబ్దాలుగా నిర్లక్ష్యానికి గురైందని మంచినీటి సమస్యను పరిష్కరించాలంటే ముందు కరెంట్ సమస్యను పరిష్కరించే విధంగా కృషి చేస్తున్నాం అని అన్నారు. అవి

  1. రీసెంట్ గా గుడిముల 33/11 కేవీ సబ్ స్టేషన్ నిర్మాణానికి శంకుస్థాపన.
  2. గుడిమెళ్ళంక సబ్ – స్టేషన్ త్వరగా మంజూరు చెయ్యాలని అదనంగా 3 వది శంకరగుప్తంలో కూడా సబ్ స్టేషన్ మంజూరు చెయ్యాలని ప్రతిపాదనలు పంపించారు.
  3. నియోజకవర్గానికి అత్యవసరంగా 250 కొత్త ట్రాన్స్ఫార్మర్లు మంజూరు చేయాలని కాలిపోయిన 50 ట్రాన్స్ఫార్మర్ల ను రీప్లేస్ చెయ్యాలని
  4. రాజోలు 33/11 సబ్ స్టేషన్ లో 5 ఎం.వి.ఏ పి.టి.ఆర్ ను 8 ఎం.వి.ఏ పి.టి.ఆర్ గా ఇంప్రూవ్ చెయ్యాలని, మంచినీటి విషయంలో సుమారు 1650 కోట్ల రూపాయలతో ధవలేశ్వరం గోదావరి నుండి నేరుగా పైప్ లైన్ ద్వారా నీరు సరఫరా చేసి సురక్షిత మంచి నీరు అందించే పథకం త్వరలోనే మంజూరు కాబోతోంది అని తద్వారా మంచినీటి సమస్యను పరిష్కరించే విధంగా కృషి చేస్తాను అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు, ఆర్.డ్బ్ల్యు.ఎస్ అధికారులు పాల్గొన్నారు.

Share this content:

Post Comment