జనసేన ఆధ్వర్యంలో 99 టీవి క్యాలెండర్ ఆవిష్కరణ

బొబ్బిలిలో 99 Tv క్యాలెండర్ ఆవిష్కరణ జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ బాబు పాలూరు చేతుల మీదుగా జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన ఐటీ విభాగ సభ్యులు శ్రీ గేదెల సతీష్ కుమార్ మరియు బొబ్బిలి నాయకులు గంగాధర్, పార్వతీపురం బొబ్బిలి జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా బాబు పాలూరు మాట్లాడుతూ 99 టీవీ ప్రజా సమస్యలపై నిత్యం పోరాడుతుంది. ఇకపై కూడా ప్రజా సమస్యలను గుర్తించి ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లి ప్రజలకు న్యాయం జరిగేలా ఇంకా పోరాడుతూ ఉండాలని ఈ ఛానల్ దినదిన అభివృద్ధి చెందాలని కోరుకుంటూ జనసేన పార్టీ తరఫున 99 టీవీ యాజమాన్యానికి సిబ్బందికి మరియు 99 టీవి ప్రేక్షకులకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు.