చీపురుపల్లి జనసేన ఆధ్వర్యంలో ఆవిర్భావ సభ పోస్టర్ ఆవిష్కరణ

చీపురుపల్లి నియోజకవర్గంలో గౌరవ జనసేన పార్టీ అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు గౌరవ పిఎసి సభ్యులు నాదెండ్ల మనోహర్ సూచనల మేరకు జనసేన పార్టీ 11వ ఆవిర్భావ సభ వాల్ పోస్టర్ ను స్థానిక పార్టీ కార్యాలయంలో పార్టీ ఇంచార్జ్ విసినిగిరి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో విడుదల చేయడం జరిగింది. మార్చి 14న పిఠాపురంలో జరగబోవు జనసేన పార్టీ 11వ ఆవిర్భావ దినోత్సవ సభ జనసేన పార్టీ యొక్క దిశ దశను మార్చే సభగా అధికారం చేపట్టిన తర్వాత డిప్యూటీ సీఎం హోదాలో శ్రీ పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న మొదటి ఆవిర్భావ సభకు భారీ సంఖ్యలో జనసైనికులు, వీరమహిళలు భారీ ఎత్తులో పాల్గొనీ జయప్రదం చేయవలసిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో గుర్ల జనసేన పార్టీ మండల అధ్యక్షులు యడ్ల సంతోష్, గజపతినగరం మండల పార్టీ అధ్యక్షులు మునకాల జగన్, ప్రోగ్రాం కమిటీ మెంబర్ దుర్గాప్రసాద్, ఎచ్చెర్ల లక్ష్మనాయుడు, చందక బాల, కిషోర్, సబ్బి సింహాచలం, ఆదినారాయణ స్వామి నాయుడు, సత్యనారాయణ పాండు జనసేనశంకర్, మరియు నియోజకవర్గ నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.

Share this content:

Post Comment