జనసేన ఆధ్వర్యంలో చలివేంద్రం ప్రారంభోత్సవం

పెందుర్తి, 89 వ వార్డు, పశ్చిమ నియోజకవర్గం ఎల్లప్పవాని పాలెం జంక్షన్ నరవ గ్రామానికి వెళ్లే రహదారి వద్ద జనసేన పార్టీ ఆధ్వర్యంలో స్థానిక నాయకులు పతకంశెట్టి శ్యామ్, కార్యదర్శి అంగా ప్రశాంతి, సీనియర్ నాయకులు పీల రామకృష్ణ చేతుల మీదుగా చలివేంద్రం ప్రారంభోత్సవం చేయడం జరిగింది. నాయకులు మాట్లాడుతూ జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ సేవా మార్గంలో, శ్రీమతి డొక్కా సీతమ్మ స్ఫూర్తితో రాబోయే రోజుల్లో ఎండ తీవ్రత ఎక్కువగా అవుతుందని ఉద్దేశంతో ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఉండడానికి నిత్యం పలు గ్రామాల నుంచి ప్రజలు రాకపోకలు సాగిస్తున్న ఈ మార్గంలో తాగునీటి సదుపాయం కోసం ఈ యొక్క చలివేంద్ర కార్యక్రమం 89వ వార్డు జనసేన పార్టీ సైనికుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం హర్షించవలసిన విషయమని, ఈనాడు ఇటువంటి పదవులు లేకపోయినా ప్రజలకు సేవ చేయడంలో గాని ప్రజా సమస్యలపై గళం ఎత్తడంలో గాని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ముందుంటారని, అలాంటి వ్యక్తిని ప్రజలందరూ ముఖ్యమంత్రి స్థానంలో చూడ్డానికి ప్రజల కోరుకుంటున్నారని, ఏమి పదవి లేకుండానే ఇన్ని సేవలు చేస్తే రేపు రాబోయే రోజుల్లో ఆయనకంటూ అధికారులు ఇస్తే మన రాష్ట్రం ఆర్థికంగా సామాజికంగా ఉన్నతమైన స్థానంలో ఉంటుందని ప్రజలకు ఎటువంటి కష్టాలు ఉండవని నమ్ముతున్నారని తప్పకుండా రానున్నది జనసేన రాజ్యమని మీడియాతో మాట్లాడడం జరిగింది. ఈ కార్యక్రమంలో నరవ గ్రామ నాయకులు వబ్బిన జనార్దన్ శ్రీకాంత్, పశ్చిమ నాయకులు జోగా వెంకటేష్, అప్పలరాజు, అవినాష్, ప్రశాంత్, రాజేష్, రాము, ప్రశాంత్, జీవన్, సాయి, పవన్, వెంకట్, మోహన్, శేఖర్ మరియు జనసేన పార్టీ సభ్యులు పాల్గొన్నారు.