హర్షవర్ధన్ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ తైక్వాండ్ గోడ పత్రిక జనసేన ఆద్వర్యంలో ఆవిష్కరణ

అరకు వేలి మండలంలో హర్షవర్ధన్ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ తైక్వాండ్ శిక్షణ గోడ పత్రిక ఆవిష్కరించిన జనసేనపార్టీ అరకు పార్లమెంట్ అధికార ప్రతినిధి మాదాల శ్రీరాములు, కోచ్ కొర్ర బంగార్రాజు, అరకు వేలి శ్రీ వెంకటేశ్వర కళ్యాణ మండపంలో జరిగిన కార్యక్రమంలో మాదాల శ్రీరాములు మాట్లాడుతూ తైక్వాండ్ శిక్షణ తరగతులు శ్రీ వెంకటేశ్వర తైక్వాండ్ మండపంలో గురువారం నుండి నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేసినట్టు కోచ్ కొర్ర బంగారాజు తెలిపారు. అదేవిదంగా శిక్షణ తరగతులలో నేర్పించి అవగానే కార్యక్రమాలు చేస్తారు.

ఆత్మ రక్షణ విద్య, క్రమశిక్షణ, మర్యాదలు, ఏకాగ్రత, ఆరోగ్య విలువలు నేర్పింపబడుతుందని వారు తెలిపారు. విద్యార్థులకు చాలా అవసరం గనుక అందరూ నేర్చుకోవాలి శిక్షణ తీసుకొని ఉన్నత స్థాయిలో పేరు పొందాలని విద్యార్థులకు సూచించడం జరిగింది. విద్యార్థులకు వ్యాయామంతో ఇలాంటి తైక్వాండ్ శిక్షణ తీసుకుంటే చాలా మంచిదని తెలిపారు. ఇటువంటి కార్యక్రమాలు అరకు ప్రాంతంలో నిర్వహించడం అభినందనీయమని కోచ్ కొర్ర బంగారాజుని అభినందించారు. ఈ శిక్షణా తరగతులు విద్యార్థులు అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాం. ఈ కార్యక్రమంలో జనసేనపార్టీ అరకు మండల నాయకులు అల్లంగి రామకృష్ణ, కోచ్ కొర్ర బంగార్రాజు, చీఫ్ కోచ్ ప్రకాష్, గెమ్మేలి శివకుమార్ జూనియర్ కాలేజ్ విద్యార్థులు పాల్గొన్నారు.