ఏలూరులో కోలాహలంగా జనసేన చలివేంద్రాల ప్రారంభోత్సవాలు

ఏలూరులో వేసవి తాపానికి అల్లాడుతున్న నగర ప్రజలను స్వాంతన పరచడానికి ఏలూరు నగరంలోని జనసేన నాయకులు 25వ డివిజన్ గాలి గోపురం వద్ద దోనేపూడి లోవరాజు, 40వ డివిజన్ చేపల తూము సెంటర్లో సరిది రాజేష్, 49వ డివిజన్ తంగెళ్ళమూడి అంబేద్కర్ సెంటర్ లో రాచప్రోలు వాసు, 6వ డివిజన్ మాదేపల్లి రోడ్ లో వాసవి రైస్ సెంటర్ లో దోసపత్తి రాజుచే ఏర్పాటు చేసిన చలివేంద్రాలను ఆదివారం ఉదయం ఏలూరు జనసేన నియోజకవర్గ ఇన్చార్జ్ రెడ్డి అప్పలనాయుడు ప్రారంబించారు. ఈ సందర్భంగా రెడ్డి అప్పల నాయుడు మాట్లాడుతూ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలకు అనుగుణంగా ఆంధ్రుల అన్నపూర్ణ డొక్కా సీతమ్మ స్ఫూర్తితో వేసవి తాపానికి దూర ప్రాంతాల నుండి వచ్చే బాటసారులు, వాహనదారుల దాహార్తి తీర్చేందుకు ఈ చలివేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. చలివేంద్రాలను ఏర్పాటు చేసిన కమిటీ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ మేయర్ జనసేన నాయకులు సిరిపల్లి ప్రసాద్, జిల్లా ఉపాధ్యక్షులు ఇళ్ళా శ్రీనివాస్, జిల్లా సంయుక్త కార్యదర్శి ఓబిలిశెట్టి శ్రావణ్ కుమార్ గుప్తా, నగర అధ్యక్షులు నగిరెడ్డి కాశీ నరేష్ ప్రధాన కార్యదర్శి సరిది రాజేష్, కావూరి వాణిశ్రీ, కార్యదర్శి కందుకూరి ఈశ్వరరావు, అధికార ప్రతినిధి అల్లు సాయి చరణ్, నాయకులు వీరంకి పండు, నిమ్మల శ్రీనివాసరావు బోండా రాము నాయుడు, రెడ్డి గౌరీ శంకర్,1 టౌన్ మహిళ ప్రెసిడెంట్ కోలా సుజాత, 2 టౌన్ మహిళ సెక్రటరీ తుమ్మపాల ఉమాదుర్గ, బీబీ, కోశాధికారి ప్రమీల రాణి తదితరులు పాల్గొన్నారు..