జనసేన పార్టీ కార్యాలయాల ప్రారంభోత్సవాలు

కుప్పం: కుప్పం నియోజకవర్గంలోని గుడుపల్లె మరియు రామకుప్పం మండల కేంద్రాల్లో కుప్పం నియోజకవర్గ ఇంచార్జ్ డా. మద్దినేని వెంకటరమణ ఆధ్వర్యంలో.. డా. పసుపులేటి హరి ప్రసాద్ ముఖ్య అతిధిగా అట్టహాసంగా జనసేన పార్టీ కార్యాలయాల ప్రారంభోత్సవాలు జరిగినవి. ఈ కార్యక్రమాల్లో జిల్లా ఉపాధ్యక్షులు మధు బాబు, రాష్ట్ర కార్యదర్శి శ్రీమతి సుభాషిని, జిల్లా కార్యదర్శులు మనోహర్, రామమూర్తి, శివయ్య, పగడాల రమణ, పసుపులేటి దిలీప్, సంయుక్త కార్యదర్శులు వేణు, మునెప్ప, మత్సకార విభాగ రాష్ట్ర కమిటీ కార్యదర్శి వామన మూర్తి, నియోజకవర్గ సమన్వయకర్తలు హరి, చంద్రు, మంజునాథ్, రామకుప్పం మండల అధ్యక్షులు హరీష్, గుడుపల్లె మండల అధ్యక్షులు అమీర్, కుప్పం రూరల్ మండల అధ్యక్షులు సుధాకర్, శాంతీపురం మండల అధ్యక్షులు కిషోర్, కుప్పం టౌన్ అధ్యక్షులు ప్రవీణ్, వి.కోట & పలమనేరు మండల నాయకులు మరియు జనసైనికులు పాల్గొని జయప్రదం చేశారు.

కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా అధ్యక్షులు, నియోజకవర్గ ఇంచార్జ్ మరియు ఇతర నాయకులు అందరూ కలిసికట్టుగా పనిచేసి రానున్న సార్వత్రిక ఎన్నికల్లో జనసేనాని పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిగా చేసేంత వరకు శక్తివంచన లేకుండా కష్టపాడాలని ప్రతిజ్ఞ పూనారు.