88వార్డ్ లో జనసేనాని క్రికెట్ లీగ్ ప్రారంభోత్సవం

పెందుర్తి నియోజకవర్గం: జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ జన్మదిన సందర్భంగా జనసేన పార్టీ ఆధ్వర్యంలో 88 వార్డ్ జనసేనాని క్రికెట్ లీగ్ గాజువాక నియోజకవర్గం యాదవ దగ్గర గ్రామంలో ప్రారంభోత్సవంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న కోన తాతారావు, వబ్బిన జనార్దన శ్రీకాంత్ మాట్లాడుతూ.. యువత ఎదుగుదలకు క్రీడలు కూడా సహకరిస్తాయని, అటువంటి క్రీడలను 88 వార్డ్ ఆధ్వర్యంలో యువతను అందరిని ఒక దగ్గర తీసుకొని వచ్చి మన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి 52వ జన్మదిన సందర్భంగా ఏర్పాటు చేయడాని హర్షించదగ్గ విషయమని, టోర్నమెంట్ లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. జనార్దన శ్రీకాంత్ మాట్లాడుతూ ఇటువంటి క్రీడలు మన 88వ వార్డులో ఏర్పాటు చేసిన సభ్యులు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరు ఐకమత్యంగా స్పోర్టివ్ స్పిరిట్ తో ఆడి విజేతలుగా నిలవాలని కోరడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు బలిరెడ్డీ ప్రసాద్, చలం, చందక చిన్నరావు, భాను, ఇందుల శ్రీనివాస్, దుబాయ్ రాజ్, భాస్కర్, మరియు జనసైనికులు ప్రజలు పాల్గొన్నారు.