కనకదుర్గ ఫ్లై ఓవర్‌ ప్రారంభోత్సవం

విజయవాడ వాసుల ట్రాఫిక్‌ కష్టాలు తీర్చేందుకు నిర్మించిన కనకదుర్గ ఫ్లైఓవర్ ఈరొజు ప్రారంభం కానుంది. ఈ ఉదయం 11:30 గంటలకు వర్చ్యువల్ కార్యక్రమంలో కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఫ్లైఓవర్‌ను ప్రారంభించనున్నారు. తన క్యాంప్ కార్యాలయం నుంచి సీఎం జగన్‌ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఫ్లై ఓవర్ ప్రారంభంతో పాటు రూ.7,584 కోట్ల విలువైన మరో 16 ప్రాజెక్టులకు భూమిపూజ చేయనున్నారు. ఇప్పటికే 8,007 కోట్లతో పూర్తయిన 10 ప్రాజెక్టులను గడ్కరీ, సీఎం వైఎస్ జగన్ జాతికి అంకితం చేయనున్నారు. మొత్తం 15 వేల కోట్ల పనులకు ఇవాళ భూమిపూజ, ప్రారంభోత్సవా కార్యక్రమాలు జరుపనున్నారు. ఇక ఇవాళ్టి నుంచి ఫ్లైఓవర్‌పై అధికారికంగా వాహనాలకు అనుమతిస్తారు.