నందికొట్కూర్ జనసేన కార్యాలయంలో యువశక్తి పోస్టర్ ఆవిష్కరణ

నందికొట్కూరు జనసేన పార్టీ కార్యాలయంలో యువశక్తి పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం జరిపిన సందర్భంలో జనసేన రానున్న మాట్లాడుతూ వైయస్సార్సీపి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ ఇవ్వడం చేతకాక అప్పుల క్యాలెండర్ ఇవ్వడం జరిగిందని వ్యాఖ్యానించారు. అలాగే ఈ ప్రభుత్వం మాటల ప్రభుత్వమే గాని చేతల ప్రభుత్వం కాదు అని తెలియజేయడం జరిగింది. అలాగే నల్లమల రవికుమార్ మాట్లాడుతూ వైయస్సార్సీపి ప్రభుత్వంలో నిరుద్యోగులు పెరిగారని, నిరుద్యోగుల కొరకు ప్రభుత్వం పరిశ్రమలు తీసుకురావడం విషయంలో విఫలమైందని చెప్పారు మరియు జనవరి 12వ తారీకు శ్రీకాకుళంలో జరిగే యువశక్తి భారీ బహిరంగ సభకు యువతీ యువకులు పాల్గొని సభని జయప్రదం చేయాలని పిలుపునివ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొని సభను జయప్రదం చేయాలని కోరినటువంటి కాకర్ల కిరణ్ కుమార్, నవీన్ రెడ్డి, మొలక శేషు, బోరెళ్లి వెంకటేశు, పెరుమల ప్రవీణ్, పగడం శేషన్న, మద్దిలేటి, నల్లమల శేఖర్, రాజు, మౌలాలి తదితరులు పాల్గొన్నారు.