జనసేన నాయకుల ఆధ్వర్యంలో యువశక్తి పోస్టర్ల ఆవిష్కరణ

అల్లూరి సీతారామరాజు జిల్లా, పాడేరులో జనసేన పార్టీ ఇన్చార్జ్ డా వంపూరు గంగులయ్య ఆధ్వర్యంలో నియోజకవర్గ మండలాల ముఖ్య నాయకులు, వీరమహిళలు కలిసి జనసేన పార్టీ నిర్వహించే యువశక్తి పోస్టర్ లను ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ సందర్బంగా గంగులయ్య మాట్లాడుతూ జనసేనాని అదేశాల మేరకు రణస్థలంలో జరగబోయే యువశక్తి రణభేరి కి అల్లూరిసీతారామరాజు జిల్లా నుంచి కూడా జనసైనికులు, ముఖ్యనాయకులు హాజరు కావాలని జనసేన కు యువశక్తి ప్రధాన బలమని, అందరూ కలిసి పనిచేయాలని గెలుపే లక్ష్యంగా పనిచేద్దామని తెలిపారు. అలాగే జనసేనాని నిర్వహించదలిసిన రైతుబరోసా యాత్రకు మన ప్రాంతంలో కూడా త్వరలోనే రైతుబరోసా యాత్రలో భాగంగా ఆదివాసీ రైతులు పండించే పంటలకు గిట్టుబాటు ధర అంశాలను కూడా పరిగణలోకి తీసుకుని జనసైనికులు, నాయకులతో కలిసి ఈ నెలలో ఒక కార్యక్రమం చేస్తూ ముందుకు సాగుదామని యువశక్తి పోస్టర్ ఆవిష్కరణ లో విచ్చేసిన ప్రతి ఒక్కరికి, వీరమహిళలకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నామని చెప్పారు. ఈ సందర్బంగా పాడేరు మండల ముఖ్య నాయకులు, కార్యనిర్వాహక అధ్యక్షులు వి.సురేష్ కుమార్, కమల్ హాసన్, అశోక్, రమేష్ నాయుడు, సత్యనారాయణ, ఈశ్వర్ నాయుడు, వీరమహిళలు కితలంగి పద్మ, దివ్యలత, జి.మాడుగుల మండల అధ్యక్షులు మసాడి భీమన్న, ఈశ్వరరావు, భానుప్రసాద్, చింతపల్లి మండల నాయకులు, వాడకాని నాని, బుజ్జిబాబు, ఫునిత్, యోగేష్, హుకుంపేట మండల నాయకులు పర్దని రమేష్, అరకువేలీ మండల సమన్వయ కమిటీ సభ్యులు మాదాల శ్రీ రాములు, జనసైనికులు పాల్గొన్నారు.