మదనపల్లె జనసేనలో విద్యార్ధుల చేరిక

మదనపల్లె నియోజకవర్గంలో ఆదివారం స్థానిక జనసేన కార్యాలయంలో పెద్ద ఎత్తున దాదాపు 100 మంది విద్యార్థులు జనసేన ఆశయాలు సిద్ధాంతాలు వచ్చి రాష్ట్ర భవిష్యత్తుకు పవన్ కళ్యాణ్ దిక్కు అని జనసేన పార్టీలో చేరడం జరిగింది. తదుపరి మదనపల్లి జనసేన స్టూడెంటు వింగ్ పోస్టర్లు రిలీజ్ శ్రీరామ రామాంజనేయులు అధ్యక్షతన రిలీజ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమం జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీమతి దారం అనిత ఆధ్వర్యంలో శ్రీరామ రామాంజనేయులు అధ్యక్షతన సుప్రీం హర్ష, షేక్ సోనుల సహకారంతో శ్రీరామ రామాంజనేయులు మరియు దారం అనిత జనసేనలో నూతనంగా చేరిన వారికి పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. విద్యార్థులు ఈ సందర్భంగా ఒక అసోసియేషన్ ప్రారంభించి జనసేన స్టూడెంటు వింగ్ గా నామకరణం చేయడం జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థులు తాము ఈ ప్రభుత్వములో ఎదుర్కొంటున్న సమస్యలను ఏకరువు పెడుతూ తమకు జరుగుతున్న అన్యాయాన్ని నష్టపోతున్న విధానాన్ని సభాముఖంగా పంచుకోవడం జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థులు తమ భవిష్యత్తు పవన్ కళ్యాణ్ ని ముక్తకంఠంతో నినదించారు. యూనస్ ఖాన్ అనే ఒక నిరుద్యోగి చేసిన ప్రసంగం అందరినీ ఆకట్టుకుని ఆలోచింపజేసేలా చేసింది. ఈ సందర్భంగా విద్యార్థులందరూ జనసేనకు అండగా ఉంటామని ఏకగ్రీవంగా తీర్మానించారు. ఈ సందర్భంగా రామాంజనేయులు మాట్లాడుతూ ఇక్కడ చదువుకొని పక్క రాష్ట్రాల్లో పని చేయాల్సిన కర్మ ఒక తెలుగు వాళ్లకు మాత్రమే ఉందని, ఆ ధోరణి మారాలని, మనం మారినప్పుడే ప్రభుత్వం మారుతుందని అన్నారు. శ్రీమతి దారం అనిత మాట్లాడుతూ నేటి విద్యార్థులే రేపటి భవిత అని నిరంతరం యువత కోసం పవన్ కళ్యాణ్ ఆలోచిస్తారని వారిని సక్రమమైన మార్గంలో నడిపించినప్పుడే దేశం ముందుకు పోతుందని ఈ సందర్భంగా దేశమంటే కలలుగనే యువత అని శ్రీశ్రీ చెప్పారని దారం అనిత అన్నారు. ఎక్కువ శాతం యువత జనసేనకు సపోర్ట్ చేస్తున్నారని, జనసేన అంటే యువ రక్తమని యువరక్తం అంటే జనసేన అనిత యువతులు, యువకులను ఉద్దేశించి సందేశం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సుప్రీం హర్షను అధ్యక్షునిగా జనసేన సోనును ఉపాధ్యక్షుడిగా ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన మదనపల్లె నాయకులు రామాంజనేయులు ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీమతి దారం అనిత గారు మదనపల్లి సీనియర్ నాయకులు దారం హరి ప్రసాద్, యువ నాయకులు శ్రీరామ హరిహరన్, జనసేన సీనియర్ మహిళా నాయకురాలు చామంతుల మల్లికా, మదనపల్లె పట్టణ ప్రధాన కార్యదర్శి కిరణ్ కుమార్ రెడ్డి, నాయకులు కోటకొండ చంద్రశేఖర్, ధరణి, అనిల్ కుమార్, తొక్కోళ్ల శివ, మైనారిటీ నాయకులు జాఫర్, అయాజ్, 100 మంది విద్యార్థులు పాల్గొన్నారు.