IND Vs ENG 1st Test Day 2: తొలి వికెట్‌ కోల్పోయిన భారత్‌.. లంచ్‌ విరామం

ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో భారత్‌ తొలి వికెట్‌ కోల్పోయింది. 36 పరుగులు చేసిన రోహిత్‌ శర్మ ఓలి రాబిన్‌సన్‌ బౌలింగ్‌లో సామ్‌ కరన్‌కు క్యాచ్‌​ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో భారత్‌ లంచ్‌ విరామానికి వెళ్లింది. ప్రస్తుతం భారత్‌ 37.3 ఓవర్లలో వికెట్‌ నష్టానికి 97 పరుగులు చేసింది. కేఎల్‌ రాహుల్‌ 48 పరుగులతో క్రీజులో ఉన్నాడు.

నిలకడగా ఆడుతున్న భారత్‌

ఇంగ్లండ్‌తో జరుగుతున్న మొదటి టెస్టులో రెండో రోజు ఆటను భారత్‌ నిలకడగా ఆరంభించింది. ప్రస్తుతం 24 ఓవర్లు ముగిసేసరికి వికెట్‌ నష్టపోకుండా 33 పరుగులు చేసింది. కేఎల్‌ రాహుల్‌ 12, రోహిత్‌ శర్మ 18 పరుగులతో క్రీజులో ఉన్నారు

నాటింగ్‌హమ్‌: ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో భారత్‌ తొలిరోజే స్పష్టమైన ఆధిక్యం కనబరిచింది. భారత పేస్‌ బౌలర్లు తమ ప్రదర్శనతో దుమ్మురేపడంతో ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 183 పరుగులకే ఆలౌటైంది. కెప్టెన్‌ జో రూట్‌ (108 బంతుల్లో 64; 11 ఫోర్లు) మాత్రమే పట్టుదల ప్రదర్శించి అర్ధ సెంచరీ సాధించగా, మిగతావారంతా విఫలమయ్యారు. జస్‌ప్రీత్‌ బుమ్రాకు 4 వికెట్లు దక్కగా… మొహమ్మద్‌ షమీ 3 కీలక వికెట్లు పడగొట్టాడు. ఆ తర్వాత బ్యాటింగ్‌ ఆరంభించిన టీమిండియా తొలి రోజు ఆట ముగిసే సమయానికి వికెట్‌ నష్టపోకుండా 21 పరుగులు చేసింది. ఓపెనర్లు రోహిత్‌ శర్మ 9, కేఎల్‌ రాహుల్‌ 9 పరుగులతో ఆడుతున్నారు.

తొలిరోజు స్పష్టమైన ఆధిక్యం కనబరిచిన భారత్‌ బ్యాటింగ్‌లో రెండో రోజు మొత్తం నిలబడి ఆడితే భారీ స్కోరు చేసే అవకాశం ఉంది. అంతకముందు బౌలింగ్‌ ధాటికి ఇంగ్లండ్‌ మొదటి రోజు తమ తొలి ఇన్నింగ్స్‌లో 65.4 ఓవర్లలో 183 పరుగులకే కుప్పకూలింది. కెప్టెన్‌ జో రూట్‌ (108 బంతుల్లో 64; 11 ఫోర్లు) మాత్రమే పట్టుదల ప్రదర్శించి అర్ధ సెంచరీ సాధించగా, మిగతావారంతా విఫలమయ్యారు. జస్‌ప్రీత్‌ బుమ్రాకు 4 వికెట్లు దక్కగా… మొహమ్మద్‌ షమీ 3 కీలక వికెట్లు పడగొట్టాడు.