ఏలూరు జనసేన ఆధ్వర్యంలో స్వాతంత్య్ర దినోత్సవ అమృతోత్సవాలు

ఏలూరు నియోజకవర్గం జనసేన పార్టీ నూతన కార్యాలయంలో 75 వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.. సీనియర్ నాయకులు పెద్దలు గుబ్బల నాగేశ్వరరావు చేతుల మీదుగా జాతీయ జెండా ఆవిష్కరణ జరిగింది..

ఈ సందర్భంగా రెడ్డి అప్పల నాయుడు మాట్లాడుతూ ఏలూరు నియోజకవర్గ ప్రజలకు, జనసేన పార్టీ నాయకులకు, మహిళ సోదరీమణులకు ప్రతి ఒక్కరికీ 75 వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.. భారతదేశ ప్రభుత్వం జెండా ఆవిష్కరణ ఉత్సవాలను 140 కోట్ల మంది ప్రజల హృదయాలలో వారి ఇళ్ళలో జాతీయ పతాకాన్ని ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోవాలని భారత ప్రభుత్వం ఆజాదీ కా అమృత మహోత్సవం నిర్ణయం తీసుకుంది..గత కొన్ని రోజులుగా ఉత్సవాలు జరుగుతూనే ఉన్నాయి..ఈరోజున్న రాజకీయ వ్యవస్థ లో పెనుమార్పులు తీసుకురావాలని పవన్ కళ్యాణ్ గారి ఉద్దేశం..భారతీయులంతా సమిష్టి అభివృద్ధి లో భాగస్వాములు కావాలి.. పార్టీలకు, మతాలకు అతీతంగా ఉండాలి.. ప్రాంతీయ తత్వాలు ప్రక్కన పెట్టాలి.. ఈరోజు మనం పోరాడుతున్నామంటే బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ప్రాణత్యాగం చేసి రక్తం చిందిస్తే ఈ 75 వసంతాలు పూర్తి చేసుకుని దేశం అభివృద్ధి లో ముందుకు నడుస్తున్నాం..దేశ అభివృద్ధి కోసం కలిసి పనిచేయాలి.. పవన్ కళ్యాణ్ గారు మంచి ఆలోచనలతో పార్టీని స్థాపించారు.. ఏలూరు నియోజకవర్గం లో ఉన్న వ్యవస్థలకు భిన్నంగా ఒక మంచి ఆలోచన తో నీతి నిజాయితీ మార్గంలో, అభివృద్ధి లో అన్ని రంగాల్లో ప్రజలకు మౌలికంగా కావలసిన వసతులు కానీ ఉపాధి కేంద్రాలు కానీ ప్రజలకు రక్షణగా ఉండాలని ఏలూరు లో నూతన కార్యాలయాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అని అన్నారు..ఈ కార్యాలయం ద్వారా భవిష్యత్తులో ఏలూరు ప్రజలకు రక్షణ కేంద్రంగా మారుస్తాం..ప్రజల మనోభావాలను కాపాడుతామని, శ్రామిక వర్గం రైతాంగం అలాగే మహిళ సోదరి మణులకు రక్షణగా ఉంటాం.. అన్ని రకాల ఆలోచన చేసే ఈ కార్యాలయాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు..75 వసంతాలు పూర్తి చేసుకుని అనేక రకాల పరిణామాలు జరిగిన రాబోయే తరానికి మంచి సమాజాన్ని అప్పజెప్పాల్సిన బాధ్యత మన మీద ఉందన్నారు.. అలాగే ఈ నూతన పార్టీ కార్యాలయం ఏర్పాటు చేయడం లో కృషి చేసిన ఏలూరు ముఖ్య నాయకులకు సహకరించిన అందరికీ అభినందనలు.. భవిష్యత్తులో అనేక రకాల కార్యక్రమాన్ని రూపొందించి ముందుకు సాగి పవన్ కళ్యాణ్ గారి ఆశయాలను ఆలోచనలను ఆంధ్ర రాష్ట్రం లో ఉన్న 5 కోట్ల మంది ప్రజలకు అందిస్తామని ఆయన అన్నారు.. అనంతరం పలు డివిజన్ లలో జెండా వందనం వేడుకలు నిర్వహించారు..

అనంతరం వాసవి క్లబ్ కే.సీ.జి.ఎఫ్ , వాసవి క్లబ్ వీ.కే.ఎస్పీ వారి ఆధ్వర్యంలో 75 వ స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా ఏర్పాటు చేసిన ఆజాదీ కా అమృత మహోత్సవం సందర్భంగా 150 అడుగుల జాతీయ పతాకంతో భారీ ఊరేగింపు మరియు ర్యాలీ లో ముఖ్య అతిథిగా హాజరైన రెడ్డి అప్పల నాయుడు..

ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షుడు నగిరెడ్డి కాశీ నరేష్, మండల అధ్యక్షుడు వీరంకి పండు, ప్రధాన కార్యదర్శి సరిది రాజేష్, జిల్లా సంయుక్త కార్యదర్శి ఓబిలిశెట్టి శ్రావణ్, రాష్ట్ర చేనేత కార్యదర్శి దోనేపూడి లోవరాజు, ఫ్యాన్స్ ప్రెసిడెంట్ దోసపర్తి రాజు,మండల ఉపాధ్యక్షులు సుందరనీడి ప్రసాద్, నాయకులు బొత్స మధు, ఎట్రించి ధర్మేంద్ర, జనసేన రవి, గొడవర్తి నవీన్, పైడి లక్ష్మణరావు, అల్లు సాయి చరణ్, బోండా రాము నాయుడు, నిమ్మల శ్రీనివాసు, బొద్దపు గోవిందు, బుధ్ధ నాగేశ్వరరావు, పల్లి విజయ్, జనపరెడ్డి తేజ ప్రవీణ్, అగ్గాల శ్రీనివాస్, ఎట్రించి మహేష్, కొనికి మహేష్, సోషల్ సర్వీస్ మురళి, కృష్ణ, పవన్, గెడ్డం చైతన్య, తోట దుర్గా ప్రసాద్, సుందరనీడి శివ శంకర్, వాసా సాయి, దుర్గారావు, బాలు వీర మహిళలు కావూరి వాణి, సరళ, సుజాత తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *