శృంగవరపుకోటలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

శృంగవరపుకోట: తిమిడి హై స్కూల్ లో జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. హెచ్ ఎం మాధవీలత అధ్యక్ష తన జరిగిన కార్యక్రమములో గ్రామ సర్పంచ్ వబ్బిన త్రినాదమ్మ జెండా ఎగురవేశారు. అనంతరము జనసేన నాయకులు వబ్బిన సన్యాసి నాయుడు విద్యార్దిని విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ 77వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా స్వాతంత్ర్య సమర యోధులు త్యాగాలను కొనియాడారు. రాజ్యాంగపరమైన లక్ష్యాలను సాధించిన ప్రగతిని వివరించారు. ఇంకా నిరుద్యోగం పేదరికం ఆర్ధిక అసమానతలు, కుల, మత ప్రాంతీయ విభేదాలను నిర్మూలించడానికి నేటి తరం యువత దేశబక్తితో సమాజాన్ని మార్చేందుకు తమ వంతు కృషి చేయాలని కోరారు. ఈ సభలో ఎంపీటీసీ పదాల ధర్మారావు వసి సర్పంచ్ వబ్బిన బంగారు నాయుడు. స్కూల్ కమిటీ ఛైర్మెన్ వబ్బిన శంకర రావు, గ్రామపెద్దలు గేదల ప్రకాష్, వి.సతీష్, పాపల కృష్ణ, వబ్బిన కాటమయ్య స్కూల్ ఉపాద్యాయులు పాల్గొని ఆటలపోటిలలో నెగ్గిన విద్యార్దిని విద్యార్దులుకు బహుమతులు ప్రధానం జేశారు.