కళ్యాణదుర్గంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

కళ్యాణదుర్గం నియోజకవర్గం: 77వ భారత స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మంగళవారం కళ్యాణదుర్గం పట్టణంలోని జనసేన నాయకులు జాతీయ జెండాను ఎగరవేసి స్వాతంత్ర దినొత్సవ వేడుకలు ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఈ సందర్భంగా కళ్యాణ్ దుర్గం బిజెపి అసెంబ్లీ ఇన్చార్జి దేవరాజ్, జనసేన పార్టీ జిల్లా సంయుక్త కార్యదర్శి బాల్యం రాజేష్ మాట్లాడుతూ స్వాతంత్ర పోరాటంలో ఎందరో ప్రాణాలను పణంగా పెట్టి బ్రిటిష్ వారితో పోరాడి మనకి ఈ స్వాతంత్రాన్ని తెచ్చినారని తెలియజేస్తూ మహనీయుల అడుగుజాడల్లో మనందరం నడుచుకొని దేశ అభివృద్ధి కొరకు పాటుపడాలని కోరారు. ఈ కార్యక్రమంలో బిజెపి జనసేన నాయకులు చెక్క సుబ్రహ్మణ్యం, వంశీ, జాకీర్, శ్రీ హర్ష, చిత్తన్న జనసేన వీరమహిళ షేక్ తార తదితరులు పాల్గొన్నారు.