శ్రీమతి బత్తుల అధ్వర్యంలో అంబరాన్నంటిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

  • భారత్ మాతాకి జై అనే నినాదాలతో మార్మోగిన కోరుకొండ
  • కోరుకొండ జనసేన పార్టీ కార్యాలయం నందు జరిగిన 77వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలో భాగంగా జాతీయ జెండా ఆవిష్కరణలో పాల్గొన్న “బత్తుల”

రాజానగరం నియోజకవర్గం: రాజానగరం జనసేన పార్టీ నాయకురాలు శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి ఆధ్వర్యంలో మంగళవారం జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలలో భాగంగా కోరుకొండ జనసేన పార్టీ కార్యాలయం నందు జాతీయ జెండా ఆవిష్కరణ చేసి దేశం స్వాతంత్య్రం కోసం పోరాడిన అమరవీరులను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో రాజానగరం నియోజకవర్గం జనసేన పార్టీ సీనియర్ నాయకులు, జనసైనికులు, వీరమహిళలు భారీగా పాల్గొన్నారు.