స్వాతంత్ర్య ఫలాలు అందరికీ చేరువ కావాలి: అడపా మాణిక్యాలరావు

స్వాతంత్ర్య ఫలాలు ప్రజలందరికీ చేరువ కావాలని జనసేన పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు అడపా మాణిక్యాలరావు అభిలాషించారు. బుధవారం గణతంత్ర దినోత్సవం సందర్భంగా జిల్లా పార్టీ కార్యాలయంలో జాతీయ జెండాను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాణిక్యాలరావు మాట్లాడుతూ ఎందరో మహానుభావుల ప్రాణత్యాగఫలమైన స్వతంత్రాన్ని పరిరక్షిన్చుకోవాల్సిన బాధ్యత ప్రతీ ఒక్కరిపై ఉందన్నారు. జిల్లా ప్రధాన కార్యదర్శి నారదాసు ప్రసాద్ మాట్లాడుతూ భారత రాజ్యాంగం పూర్తిగా ఆమోదించబడిన రోజున గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటామని, గణతంత్రం అనగా ప్రజలే ప్రభుత్వం, ప్రభుత్వమే ప్రజలని అర్ధం అని అన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశంలో పుట్టినందుకు భారతీయుడిగా ప్రతీక్షణం గర్వపడతామని అన్నారు. కార్యక్రమంలో జనసైనికులు ఆళ్ళ హరి, దాసరి వెంకటేశ్వరరావు, మహంకాళి శ్రీనివాస్, ఇల్లా శేషు, కానవరపు శ్రీనివాస్, మధులాల్, అలా కాసులు, కిషోర్, నాని తదితరులు పాల్గొన్నారు.