India Book of Records: రెండేళ్ల బుడతడి ఘనత.. రికార్డే మరి .. !

సాధారణంగా రెండేళ్ల బుడతడు బుడిబుడి అడుగులు వేస్తూ.. అమ్మ వేలు పట్టుకుని చిన్న చిన్న మాటలను వల్లెవేస్తూ సందడి చేస్తుంటాడు. కానీ ఇక్కడ ఈ బుడతడు చిన్న వయసులోనే అసాధ్యమైన పనులను సుసాధ్యం చేస్తూ.. రికార్డు కొట్టాడు. ఏకంగా ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్‌లో స్థానం సంపాదించాడు. కరీంనగర్‌కు చెందిన అశోక్‌రెడ్డి, ఆశ్రితల కుమారుడు వేదాంశ్‌ సాయిరెడ్డి ఈ ఘనతను సాధించాడు. ఏడు పక్షులను, 24 జంతువులను, 22 శరీర భాగాలను, 10 ఆహారపు వస్తువులను, 13 పండ్లను, 2 కూరగాయలను గుర్తించగలడు. అలాగే నెంబర్స్‌తో పాటు 8 జికె ప్రశ్నలకు సమాధానమివ్వగలడు. 21 రకాల అభినయం, ప్రపంచ పటం , ఆకారాల పజిల్స్‌ పూర్తి చేస్తాడు. పేపర్‌ కప్పులతో పిరమిడ్‌ తయారు చేస్తాడు. ఆ బుడతడి ప్రతిభను గుర్తించిన ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్‌ మెడల్‌ను అందించింది.