నదుల చట్టానికి తూట్లు పొడుస్తూ యథేచ్ఛగా ఇసుక తవ్వాకాలు: గాదె

గుంటూరు: ప్రకృతి సిద్ధంగా ప్రవహించే కృష్ణనది ప్రవాహానికి నష్టం కలిగేలా వందల మీటర్ల పొడవునా కొల్లిపోరలో అక్రమ ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయని.. పూర్తి అధికార పార్టీ నాయకుల కనుసన్నల్లోనే ఇదంతా జరుగుతుందని జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు అన్నారు. తెనాలి నియోజకవర్గం కొల్లిపోర మండలంలో యథేచ్ఛగా అక్రమ ఇసుక తవ్వకాలు జరువుతున్నారని.. దీని వలన సహజ సిద్ధంగా ప్రవహించే నది ప్రవాహానికి నష్టం కలుగుతోందని… రానున్న రోజల్లో లంక గ్రామాలకు పెను ప్రమాదంగా మారుతుందని హెచ్చరించారు.. స్వాతంత్ర్యం వచ్చిన తరువాత నుండి 2019 వరకు ఇక్కడ ఎటువంటి ఇసుక తవ్వకాలు చేపట్టలేదన్నారు.. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక అనూహ్యంగా ఆయన చూపు ఈ ప్రాంతపై పడిందని.. పెద్ద పెద్ద బుల్డోజర్స్ తో ఇసుక తవ్వకాలు జరుపుతున్నారని అన్నారు.. నది చట్టాల ప్రకారం ఎటువంటి యంత్రాలతో నదిలో ఇసుక తవ్వకాలు జరపకూడదని చెప్తుంటే… చట్టాలను కూడా ఖాతరు చేయకుండా ఇష్టా రాజ్యాంగా నది గర్భంలో తవ్వకాలు చేస్తున్న అధికారులు మొద్దు నిద్ర పోతున్నారని అన్నారు..

పెత్తనం అధికార పార్టీ నాయకులదే- అధికారులు నామ మాత్రమేనా..

కొల్లిపొర అక్రమ ఇసుక తవ్వకాలలో అధికారులు నామ మాత్రమేనని.. అధికార పార్టీ నాయకులు చెప్పిందే అక్కడ జరుగుతుందని గాదె అన్నారు… నది పోరులో జరుగుతున్న ఇసుక తవ్వకాలపై సంబంధిత అధికారులను సంప్రదిస్తే అనూహ్యమైన సమాధానాలు చెప్పరాని.. కొంత మంది అధికారులు సమాధానం చెప్పడానికి నిరాకరించారని అన్నారు.. మైన్స్ డిపార్ట్మెంట్.. అటవీ శాఖ ఇరిగేషన్ ఏ.డి లను సమాచారం అడిగితే చెప్పలేదన్నారు.

ప్రకటనలో ఇసుక టన్ను 425 – ర్యాంపు లో 625 రూ..

ముఖ్యమంత్రి జగన్ అట్టహాసంగా నాణ్యమైన ఇసుక టన్ను 425 కే ఇస్తున్నామని గొప్పలు చెప్తున్నారని.. వాస్తవ పరిస్థితులు చూస్తుంటే ఇసుక ర్యాంపు లో 625 రూ వసూలు చేస్తున్నారని.. 200 ఎక్కువ ఎందుకని అడిగేతే మాకుతెలియదు అంటూ అక్కడ పని చేస్తున్న వారు సమాధానం చెప్పారని అన్నారు… ఈ విధానంగా చూస్తే అన్ని విధాలుగా నష్టం కలుగుతున్న అధికారులకు మాత్రం చీమ కుట్టినట్టు కూడా లేదన్నారు.. ఇదే విదంగా కొనసాగితే జనసేన పార్టీ నుండి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కు కూడా వెళ్తామని.. నదులను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని అన్నారు.. ఈ కార్యక్రమంలో స్టేట్ కార్యదర్శి బండారు రవికాంత్, జిల్లా నాయకులు ఇస్మాయిల్ బేగ్, అడపా మాణిక్యాలరావు, నారదాసు రామచంద్ర ప్రసాద్, సోమరౌతు అనురాధ, మత్తి భాస్కర్, మేకల రామయ్య, అప్పారావు, సూర్య, కృష్ణ మోహన, మండల అధ్యక్షులు పసుపులేటి శ్రీను, ఎర్రు వెంకయ్య, వాస శ్రీనివాస్, వెంకటేశ్వరరావు, చింత శివ, నేరెడ్ల నాని, గంగరాజు, పెతెల్ల మల్లి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.