మందపాడు న్యూ కాలనీ వాసులకు మౌలిక సదుపాయాలు కల్పించాలి: బూరగడ్డ శ్రీకాంత్

కృష్ణాజిల్లా, గుడివాడ నియోజకవర్గం, గుడివాడ పట్టణంలో మందపాడు న్యూ కాలనీ వాసులు అనేక సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. వారి ఇబ్బందులు గురించి తెలిసీ జనసేన ఇంచార్జి బూరగడ్డ శ్రీకాంత్ జనసేన నాయకులతో కలిసి కాలనీ వాసులను సందర్శించటం జరిగింది. 2007లో అప్పటి ప్రభుత్వం సుమారు 300 కుటుంబాలకు పట్టాలు ఇచ్చి గాలికి వదిలేసింది ప్రభుత్వాలు మారినా వీరిని పట్టించుకోకపోవటం, ఇప్పటి ఎమ్మెల్యే కొడాలి నాని కూడా వీరికి హామీ ఇచ్చి వీరికి ఏమి చేయకపోవడంతొ దయనీయ పరిస్థితులలో ఉన్న వీరికి జనసేన అండగా ఉంటుంది అని హామీ ఇవ్వటం జరిగింది. తక్షణం కాలనీ వాసులకు మౌలిక సదుపాయాలు అంతర్గత రోడ్లు, డ్రైన్లు, వీధి దీపాలు, మంచినీరు, సదుపాయాలు ప్రభుత్వ అధికారులు కల్పించాలి అని జనసేన పార్టీ తరుపున డిమాండ్ చేయడం జరిగింది.

ఈ కార్యక్రమంలో కాలనీ మహిళలు, కొదమల గంగాధర రావు(జిల్లా కార్యదర్శి), గాడి కిరణ్, వేమూరి త్రినాధ్, జేమ్స్, మజ్జి శ్రీనివాసరావు, చింతా దుర్గా రామకృష్ణ(ఐ.టీ కోర్దినేటర్), వెంకట రమణ తదితరులు పాల్గొన్నారు.