జనసేన ఆవిర్భావ సభా ప్రాంగణంలో ఏర్పాట్ల పరిశీలన

పిఠాపురంలో ఈ నెల 14వ తేదీన నిర్వహించే జనసేన పార్టీ ఆవిర్భావ సభ ఏర్పాట్లపై సభా ప్రాంగణంలో పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్, రాష్ర్ట పౌర సరఫరాల శాఖ మంత్రి శ్రీ నాదెండ్ల మనోహర్ గారు పరిశీలన చేశారు. శనివారం సాయంత్రం ఆ ప్రాంగణానికి వెళ్లి ఏర్పాట్లపై కార్యక్రమాల నిర్వహణ కమిటీ ఛైర్మన్ శ్రీ కళ్యాణం శివ శ్రీనివాస్, ఇతర సభ్యులతో సమీక్ష చేశారు. సభకు హాజరయ్యే ఏ ఒక్కరూ ఇబ్బందిపడకూడదని, అందుకు తగిన విధంగా ఏర్పాట్లు చేయాలని దిశా నిర్దేశం చేశారు. ఈ సమీక్షలో శాసన మండలిలో ప్రభుత్వ విప్ శ్రీ పిడుగు హరిప్రసాద్ గారు, శాసన సభలో ప్రభుత్వ విప్ శ్రీ అరవ శ్రీధర్ గారు, ఎమ్మెల్యే శ్రీ పత్సమట్ల ధర్మరాజు గారు, పార్టీ నేతలు పాల్గొన్నారు.

Share this content:

Post Comment