అరకు జనసేన ఆద్వర్యంలో జగనన్న ఇళ్లు పేదలందరికీ కన్నీళ్లు

అరకు నియోజకవర్గం: జనసేన పార్టీ అధ్యక్షులు కొణిదెల పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు
అరకు పార్లమెంట్ వర్కింగ్ కమిటీ కొన్నేడి లక్ష్మణరావు ఆధ్వర్యంలో అరకు నియోజకవర్గం డుంబ్రిగూడ మండలం అరకు పంచాయతీ లో #Jagananna Mosam జగనన్న ఇల్లు పేదలందరికీ కన్నీళ్లు కార్యక్రమంలో బంగారు రామదాసు అరకు నియోజకవర్గ నాయకుడు పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో బంగారు రామదాసు అరకు నియోజకవర్గ నాయకుడు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేదవాళ్లకు ప్రతి అర్హులైన కుటుంబానికి గృహము కట్టిస్తానన్న ప్రభుత్వము గ్రామీణ ప్రాంతంలో ఒకటి పాయింట్ ఐదు సెంట్లు పట్టణ ప్రాంతంలో ఒక సెంట్లు చొప్పున 30.76 లక్షల అర్హులైన పట్టాదారులకు పంపిణీ చేసిన వైసీపీ పార్టీ మొదటి దశలో 28.080 కోట్లతో 15.6 లక్షల ఇల్లు నిర్మాణ ఇల్లు నిర్మించడానికి శ్రీకారం చుట్టి గ్రామీణ ప్రాంతంలో జగనన్న కాలనీ పేరుతో 17.005 లే అవుట్లులో రెండవ దశలో 58.940 కోట్లతో 28.30 లక్షలు ఇలళ్ళ స్థలాలను చూసి వాటిని శంకుస్థాపన వరకు ఫోటోలకు పరిమితమైన ఈ ప్రభుత్వము.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేదోళ్ల కళ్ళు తుడుస్తానన్నటి రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు ఈ రాష్ట్ర పేదలకు కన్నీళ్లు దిగమింగుతూ అప్పులు పాలు అయిన పేదలకు రాష్ట్రంలో జగనన్న కాలనీలు పేరుతో పట్టా ఇచ్చి పట్టా వరకే పరిమితం చేసిన ప్రజలకు ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వము సమాధానం చెప్పవలసిందే.. ఇల్లు కట్టలేని స్థలము ఇల్లు లేక బయట నుంచి గుడిసెల నుంచి జీవనం సాగిస్తున్నటువంటి పేదలకు ఇప్పటివరకు ఆ స్థలంలో ఎటువంటి ఇల్లు నిర్మాణం లేకపోవడం వల్ల ఏజెన్సీ గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. కావున వైసిపి పార్టీ చేపట్టినటువంటి జగనన్న కాలనీ ఇల్లులను తక్షణమే నిర్మించాలని.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డుంబ్రిగూడ మండలం అరకు గ్రామానికి వైఎస్ఆర్ కాలనీ ఇచ్చి మూడు సార్లు శంకుస్థాపన చేసి పట్టావరకు పరిమితం చేసిన ఈ ప్రభుత్వము తక్షణమే గృహము నిర్మించాలని.. ఈ స్థలంలో వాళ్లకు ప్లాట్లు నిర్మించి ఇవ్వాలని అరకు నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు బంగారు రామదాసు, కొన్నేడి లక్ష్మణరావు అరకు పార్లమెంట్ వర్కింగ్ కమిటీ, అరకు పార్లమెంట్ అధికార ప్రతినిధి మాదాల శ్రీరాములు డిమాండ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో అరకు మండలం అధ్యక్షులు అల్లంగి రామకృష్ణ, డుంబ్రిగూడ మండలం అధ్యక్షులు కొన్నేడి సిన్నారావు, ఐటీ శాఖ సంతోషి, పార్లమెంట్ కమిటీ మెంబర్ శ్రీనివాస్ రెడ్డి, దురియ సాయిబాబా మరియు తదితరులు పాల్గొనడం జరిగింది.