పలమనేరు జనసేన ఆద్వర్యంలో టిడ్కో ఇళ్ళ పరిశీలన

పలమనేరు నియోజకవర్గం: జగనన్న ఇళ్లు – పేదలందరికీ కన్నీళ్లు పర్యటనలో పలమనేరు నియోజకవర్గంలో జగనన్న ఇళ్లను పరిశీలించడం జరిగింది. ఈ పరిశీలనలో గమనించ దగ్గ విషయాలు ఇళ్ల స్థలం చాలా చిన్నదిగా ఉంది కనీసం నలుగురు జీవించడానికి కూడా వీలులేని పరిస్థితి, మురికి నీటి వ్యవస్థ కాలవ్యవస్థ లేదు, వర్షాకాలంలో లోపట ప్రాంతంలో ఉన్న దాదాపు 500 ఇండ్లు మునిగిపోవడం జరుగుతుంది. ఒక్క ఇంటి నిర్మాణానికి 180000 ఇస్తున్నారు ఒక్క ఇసుకకు 30000 అయిపోతుంది గవర్నమెంట్ ఇచ్చే డబ్బులు ఏ మాత్రం సరిపోవడం లేదు. #JaganannaMosam కార్యక్రమంలో సామల సుబ్రహ్మణ్యం రెడ్డి, రాజు, రమేష్, అనిల్, సునీల్, హార్శ, విజయ్, భార్గవ్, నాని, నాగేంద్ర పాల్గొన్నారు.