కశింకోట జనసేన ఆద్వర్యంలో టిడ్కో ఇళ్ళ పరిశీలన

అనకాపల్లి: ఆదివారం కశింకోట మండలంలో పలు గ్రామాల్లో జగనన్న ఇళ్ల పట్టాలు ఇచ్చిన ప్రదేశాల్లో మండల జనసేన నాయకులు మరియు జనసైనికులు పర్యటించి ఇళ్ల పట్టాల లబ్దిదారులతో మాట్లాడి పట్టాల కేటాయింపులో జరిగిన అవకతవకలు గురిండి అడిగి తెలుసుకున్నారు. తాళ్లపాలెం, బంగారయ్యపేట గ్రామాలలో జగనన్న ఇళ్లు పరిస్థితి ఎలా ఉందంటే ఇళ్ల నిర్మాణాలకి మెటీరియల్ సరఫరా చేసుకోవడానికి కూడా కనీసం రోడ్డు సౌకర్యం లేదు. అక్కడ భవన నిర్మాణ కార్మికులను అడిగితే తెలిసిన విషయం ఏమంటే 100 కు పైగా ఇళ్ళు శాంక్షన్ చేస్తే, ఇది వరకు పూర్తి స్థాయిలో నిర్మించిన ఇళ్ళు కేవలం 12 మాత్రమే అని. ఇది వాస్తవంగా ఇక్కడి పరిస్థితి, పూర్తి స్థాయిలో ఇళ్ళు నిర్మించి ఇస్తామని చెప్పి పేదలకు జగనన్న చేసిన మోసం ఇది. అనంతరం మండలంలోని కొత్తపల్లి-బుచ్చియ్యపేట, పేరంటాలపాలెం, జోగారావుపేట, తేగాడ గ్రామాలలో జగనన్న ఇళ్ల పని తీరుని మండల జనసైనికులు పరిశీలించారు. ఈ సందర్భంగా కనీసం మౌలిక సదుపాయాలు లేని కాలనీల ఫోటోలు వీడియోలు తీసి #JaganannaMosam అనే హ్యాష్ ట్యాగ్ తో సోషల్ మీడియా లో పోస్టు చేశారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు పావాడ కామరాజు, ఉత్తాడ రామరాజు, కర్రి గోవింద్, కడిమి నాగ చిరంజీవి, అఖిల్ శ్రీను, సుంకర మహేష్, కలిగెట్ల వీరు, గూడెపు మణికంఠ, ఊడి నూకరాజు, అధికారి శ్రీను, తోరం గణేష్, కర్రి సత్తిబాబు, ఉల్లింగల శ్రీను, అరిగా గణేష్, జోగాడ సతీష్, ఐనాలా నాయుడు, పావాడ కార్తీక్ తదితరులు పాల్గొన్నారు.