స్ఫూర్తి ప్రదాత మదర్ ధెరిస్సా: కందుల నాగరాజు

★ 41వ వార్డులో మదర్ ధెరిస్సా జయంతి వేడుకలు
★ 1500 మందికి అన్నదాన కార్యక్రమం
★ ముఖ్య అతిథిగా పాల్గొన్న డాక్టర్ కందుల
★ 88వ రోజుకి చేరిన పవనన్న ప్రజా బాట

విశాఖ పట్టణం, తోటివారికి సాయం చేయడానికి తన వ్యక్తిగత జీవితాన్నే త్యజించిన మహనీయురాలు మదర్ ధెరిస్సా అని దక్షిణ నియోజకవర్గ జనసేన నాయకులు మరియు 32 వ వార్డు కార్పొరేటర్ డాక్టర్ కందుల నాగరాజు కొనియాడారు. ఆయన ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పవనన్న ప్రజాబాట కార్యక్రమంలో భాగంగా నియోజవర్గంలో పలు ప్రాంతాలలో పర్యటించారు. ఈ సందర్భంగా 41 వ వార్డు అంతోని శేఖర్ ఆధ్వర్యంలో నిర్వహించిన మదర్ ధెరిస్సా పుట్టినరోజు కార్యక్రమంలో భాగంగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా డాక్టర్ కందుల నాగరాజు, శివప్రసాద్ రెడ్డి పాల్గొన్నారు. సుమారు 1500 మందికి అన్నదాన కార్యక్రమం జరిగింది. అనంతరం డాక్టర్ కందుల నాగరాజు మాట్లాడుతూ కష్టాల్లో ఉన్న వారికి వెతికి మరీ సాయం చేసిన అమ్మ మథర్ థెరిసా అన్నారు. అంతటి గొప్ప మనసు ఉన్న వ్యక్తి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువేనని పేర్కొన్నారు. మనం మాట్లాడే ప్రతి మాట ప్రేమతోనే మాట్లాడాలి, వందమందికి సహాయపడాల్సిన అవసరం లేదు, కనీసం ఒక్కరికైనా సహాయపడు. సహాయం చేయడానికి ఉండాల్సింది డబ్బు కాదు మంచి మనసు, ఈ ప్రపంచంలో ఐక్యమత్యానికి దారి చూపగలిగేది కేవలం పవిత్రమైన ప్రేమ అంటూ ఎంతోమంది అనాధలకు ప్రేమను పంచిన మదర్ థెరిసా జీవితం ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచిందన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన యువ నాయకులు కందుల బద్రీనాథ్, కందుల కేదార్నాథ్ తదితరులు పాల్గొన్నారు.