హనుమాన్ వ్యాయామశాలలో వాటర్ డిస్పెన్సర్ ఏర్పాటు

విశాఖపట్నం, సీతమ్మధార సమీపంలో చైతన్య నగర్, హనుమాన్ వ్యాయామశాలలో ఆప్ సబ్ కీ ఆవాజ్ సంస్థ ప్రెసిడెంట్ శివ్ వడ్లమూడి, కార్పోరేటర్ పద్మారెడ్డి మరియు భర్త కేశవ్ ఆధ్వర్యంలో, ఎన్.ఆర్.ఐ సీనియర్ కార్డియాలజిస్టు డా. పెన్నేరు సుబ్రహ్మణ్యం, సీనియర్ సిటిజన్ రఘురామ రెడ్డి, హనుమాన్ వ్యాయామశాల కోచ్ వీరందరి సమక్షంలో ప్రజల వినియోగార్ధం బ్లూ స్టార్ వాటర్ డిస్పెన్సెర్ (హాట్ & కోల్డ్) ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆప్ సబ్ కీ ఆవాజ్ సంస్థ సెక్రెటరీ బావిశెట్టి కిరణ్ కుమార్, ప్రతినిధులు రవితేజ, కొండేటి భాస్కర్, ట్రెజరర్ జోగీంద్రనాధ్ సాయి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.. ఈ సందర్భంగా కార్పోరేటర్ శ్రీమతి సాడి పద్మా రెడ్డి మాట్లాడుతూ.. సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఆప్ సబ్ కీ ఆవాజ్ సంస్థ ప్రెసిడెంట్ శ్రీ శివ్ వడ్లమూడి గారిని, సెక్రెటరీ శ్రీ బావిశెట్టి కిరణ్ గారిని అభినందించారు. వాటర్ డిస్పెన్సెర్ అందించినందుకు శివ్ వడ్లమూడి గారికి ధన్యవాదాలు తెలియజేశారు. చైతన్య నగర్ లో ఆప్ సబ్ కీ ఆవాజ్ సంస్థ ప్రెసిడెంట్ శ్రీ శివ్ వడ్లమూడి గారు, సెక్రెటరీ బావిశెట్టి కిరణ్ కుమార్ మరియు సంస్థ ప్రతినిధులు- శ్రీ రవితేజ వెహికల్స్ పార్కింగ్ విషయంలో తీసుకోవలసిన జాగ్రత్తలు గురించి ఒక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. “అమ్మను అంబులెన్స్ లో హాస్పిటల్ కి తీసుకెళ్లడానికి దయచేసి దారికి అడ్డం లేకుండా మీ వెహికల్స్ పార్కింగ్ చేయండి” ఈ వాక్యంతో ఫ్లెక్సీలు వేయించి, పల్సస్ హెల్త్ టెక్ సంస్థ ఛైర్మన్ గేదెల శ్రీను బాబు సహకారంతో, చైతన్య నగర్ లో ఈ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి, వెహికల్స్ పార్కింగ్ విషయంలో సామాజిక చైతన్యం తీసుకురావడానికి కృషి చేశారు. గత 40 సంవత్సరాలుగా స్ధానికంగా నివాసం ఉంటున్న శ్రీ భద్రరావు ఇంత మంచి కార్యక్రమం చేసినందుకు ఆప్ సబ్ కీ ఆవాజ్ సంస్థ ప్రెసిడెంట్ శ్రీ శివ్ వడ్లమూడి గారిని ప్రత్యేకంగా అభినందించారు.