ఏపీలో ఇంటర్ ఆన్‌లైన్‌ ప్రవేశాలు!

ఏపి  ఇంటర్మీడియట్ కాలేజీలో ప్రవేశాలకు తొలిసారిగా ఆన్‌లైన్ విధానం  వినియోగo లోనికి తీసుకు వచ్చారు. ఇందులో భాగంగా సెప్టెంబర్ 1 నుంచి ఏపీలో ఇంటర్ ప్రవేశాలకు రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డు ఏర్పాట్లు చేస్తోంది. ఇదివరకులా   కాకుండా ఒక్కో సెక్షన్‌లో కేవలం విద్యార్థుల సంఖ్యను 40 ఉండేలా చూస్తున్నారు. ప్రైవేట్ జూనియర్ కాలేజీలలో సీట్ల భర్తీలో భాగంగా ఆర్ట్స్ గ్రూపుతో కలిపి గరిష్టంగా 9 సెక్షన్లకు మాత్రమే ఏపీ ఇంటర్ బోర్డు అనుమతి ఇచ్చింది.

కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో అందరూ పదో తరగతి విద్యార్థులను పాస్ చేసిన కారణంగా వారంతా ఇంటర్‌లో చేరే అవకాశం ఉందని తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. గతంలో మాదిరిగా ఫస్టియర్ విద్యార్థులకు ఫీజు రూ.3,119, సెకండియర్ విద్యార్థులకు రూ.3,432గా నిర్ణయించారు. అయితే ఈ ఏడాది ఆన్‌లైన్ ద్వారా కాలేజీలలో ప్రవేశాలు  పొందాల్సి ఉంటుంది.

త్వరలోనే ఏపీ ఇంటర్మీడియట్ బోర్డు ఆన్‌లైన్ లింక్‌ను షేర్ చేయనుంది. తద్వారా విద్యార్థులు ఆన్‌లైన్‌లో కాలేజీలను ఎంపిక చేసుకోవచ్చు. మరోవైపు ప్రస్తుతం సెకండియర్ చదువుతున్న విద్యార్థులకు స్మార్ట్‌ఫోన్ లు లేని కారణంగా కేవలం 40 శాతం మంది ఆన్‌లైన్ క్లాసులు వినే అవకావం ఉందని కాలేజీలలో సోషల్ డిస్టాన్సింగ్ ద్వారా వారు నష్టపోకుండా చూడాలని కోరుతున్నారు.