‘బ్లాక్’ సినిమా నుంచి ఆసక్తికరమైన టీజర్!

డైలాగ్ కింగ్ సాయి కుమార్ తనయుడిగా సినీ ఇండస్ట్రిలో అడుగుపెట్టిన ఆది.. తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు. వరుస సినిమాలతో దూకుడు పెంచాడు. ‘అమరన్’ .. ‘కిరాతక’ .. ‘బ్లాక్’ సినిమాలు ఆయన చేతిలో ఉన్నాయి. ఒకదానితో ఒకటి ఎంతమాత్రం సంబంధం లేని కథలను ఆయన చేస్తూ వెళుతున్నాడు. ఈ మూడు సినిమాల్లో ఒకటైన ‘బ్లాక్’ సినిమా నుంచి తాజాగా టీజర్ ను వదిలారు.

యాక్షన్ సీన్స్ పై కట్ చేసిన టీజర్ ఇంట్రెస్టింగ్ గా ఉంది. విలన్ ఆటకట్టించడానికి హీరో చేసే ప్రయత్నం .. హీరో అంతుచూసే వ్యూహాలతో విలన్ మధ్య జరిగే వార్ తో ఈ కథ నడవనున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాలో ఆది సాయికుమార్ డేరింగ్ పోలీస్ ఆఫీసర్ గా, గతంలో కంటే మరింత ఫిట్ నెస్ తో కనిపిస్తున్నాడు.

మహంకాళి  మూవీస్ బ్యానర్ పై రూపొందుతోన్న ఈ సినిమాకు, జీబీ కృష్ణ దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు. థ్రిల్లర్ నేపథ్యంలో సాగే ఈ సినిమాతో కథానాయికగా ‘దర్శన’ పరిచయమవుతోంది. సురేశ్ బొబ్బిలి సంగీతాన్ని అందించిన ఈ  సినిమాను త్వరలోనే విడుదల చేయనున్నారు.