టిడ్కోలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం

దేవర్లంక-టిడ్కోగృహ సముదాయంలో ఐద్వా ఆధ్వర్యంలో “అంతర్జాతీయ మహిళా దినోత్సవం” నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఐద్వా కోనసీమ జిల్లా కార్యదర్శి టి. నాగవరలక్ష్మి మహిళా దినోత్సవ ప్రాముఖ్యతను వివరించారు, మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలని అన్నారు. గృహ లబ్ది దారు ఉప్పాడ నూకరత్నం మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐద్వా కోనసీమ జిల్లా అధ్యక్షురాలు ఎమ్. డి. హమీదా ఉన్నిషా, పట్టణ కమిటీ సభ్యురాలు సి. హెచ్. లావణ్య, మండల కమిటీ సభ్యురాలు కె. వెంకట లక్ష్మి, ఉప్పాడ నూకరత్నం, వి. రామలక్ష్మి, మాచర్ల. వి. లక్ష్మీ, నల్లా వెంకట లక్ష్మీ, కె. స్వర్ణ కమల, ఎమ్. రమణమ్మ, డి. వీరవేణి, ఎన్. సూర్యవతి, డి. శేషారత్నం తదితరులు పాల్గొన్నారు.

Share this content:

Post Comment