- కోలాటమాడిన వీర మహిళలు
నెల్లూరు, నేటి పోటీ ప్రపంచంలో మహిళలు ప్రతి రంగంలోనూ ముందుకు సాగాలని జనసేన పార్టీ జిల్లా సీనియర్ నాయకుడు నూనె మల్లికార్జున యాదవ్ ఆకాంక్షించారు. శనివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని నెల్లూరు గోమతి నగర్ లోని జనసేన పార్టీ కార్యాలయంలో మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొదట మహిళల అభివృద్ధి అభ్యున్నతి ఆర్థిక సామాజిక రాజకీయంగా మెరుగుపడితే దేశం సుభిక్షంగా ఉంటుందని ఆయన అన్నారు. జనసేన పార్టీ లోని వీర మహిళలు నిరంతరం ప్రజాసేవ చేస్తూ మహిళా సమస్యలపై స్పందిస్తున్న తీరు అభినందనీయమన్నారు. ఎక్కడ మహిళలు గౌరవింపబడతారో అక్కడ దేవతలు కొలువు తీరుతారన్న మాట సత్యమన్నారు. నేడు మహిళలు అనేక రంగాలలో పురుషులతో పోటీ పడుతూ ముందుకు సాగుతున్న తీరు వారి సమర్ధతకు ప్రతీక అన్నారు. ఎందరో ఆదర్శ మహిళలను భారతదేశం అందించిందన్నారు. అనంతరం జిల్లా కార్యదర్శి గునుకుల కిషోర్ మాట్లాడుతూ కుటుంబ బాధ్యతలు నిర్వర్తించే స్థాయి నుంచి దేశ పరిపాలనా బాధ్యతలు నిర్వహించే స్థాయికి ఎదిగిన మహిళలను చూస్తే గర్వంగా ఉంది. ఇందుకు ఉత్తమ ఉదాహరణ మన దేశ రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము గారు. మారుమూల పంచాయతీ స్థాయి నుంచి భారతదేశ రాష్ట్రపతిగా ఎదిగిన ఆమె ప్రస్థానం ఎంతో స్ఫూర్తిదాయకం. వీరమహిళలూ మీరు ఒంటరిగా లేరు… మీ బలానికి, మీ లక్ష్యాలకు మేమంతా తోడుగా ఉంటాం, మనం కలిసికట్టుగా నడిస్తే – జనసేన పార్టీ ఒక బలమైన శక్తిగా మారుతుందని అన్నారు. ఈ సందర్భంగా కేక్ కటింగ్ చేశారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని జరిగిన వేడుకల్లో జనసేన పార్టీ కార్యాలయంలో ప్రత్యేకంగా మహిళలు కోలాట ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు గునుకుల కిషోర్, కృష్ణారెడ్డి శేఖర్ రెడ్డి, రవికుమార్ జమీర్, వీర మహిళలు గునుకుల విజయలక్ష్మి, రాధమ్మ కస్తూరమ్మ, నందిని, విజయలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.


Share this content:
Post Comment