- ఈ నెల 8 నుంచి 10వ తేదీ వరకు ఉచిత వైద్య శిబిరం నిర్వహణ
- వివిధ రంగాలకు చెందిన పలువురు మహిళలను సత్కరించిన డాక్టర్ చంద్రశేఖర్
- హజరైన జనసేన పార్టీ నాయకురాలు తిరుపతి అనూష
విజయవాడ, మహిళలు అన్ని రంగాల్లో ముందుకు సాగాలని, తమ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ కుటుంబానికి మరియు సమాజానికి సేవలు అందించాలని శ్రీ భవాని హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ వెనిగళ్ళ చంద్రశేఖర్ అన్నారు. శనివారం, అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా భవానిపురంలోని శ్రీ భవాని హాస్పిటల్‌లో మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా, వివిధ రంగాలకు చెందిన పలువురు మహిళలను సత్కరించి, కేక్ కట్ చేసి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ, “మహిళాభివృద్ధితోనే దేశాభివృద్ధి ముడిపడి ఉందని” అన్నారు. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఈ నెల 8 నుంచి 10వ తేదీ వరకు తమ హాస్పిటల్‌లో ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జనసేన పార్టీ నాయకురాలు తిరుపతి అనూష మాట్లాడుతూ, “సేవా దృక్పథంతో మహిళల ఆరోగ్యం పట్ల శ్రీ భవాని హాస్పిటల్ యాజమాన్యం చూపిస్తున్న శ్రద్ధ అభినందనీయమని” అన్నారు. “మహిళలు తరచూ తమ కుటుంబ సభ్యుల ఆరోగ్యం గురించి శ్రద్ధ వహిస్తుంటారు, కానీ తమ ఆరోగ్యాన్ని పట్టించుకోకపోతున్నారని” చెప్పారు. “మహిళలు ఆరోగ్యంగా ఉంటేనే ఆ కుటుంబం సంతోషంగా ఉంటుంది” అని వివరించారు. ప్రతి ఏడాది మార్చి 8న ప్రపంచ మహిళా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్న సందర్భంగా, ప్రపంచవ్యాప్తంగా అన్ని రంగాలలో విశేష కృషి చేస్తున్న మహిళలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. మహిళలు సమాజ నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తూ, అన్ని రంగాల్లో అగ్రభాగాన నిలుస్తూ దేశ అభివృద్ధికి దోహదపడుతున్నారని చెప్పారు. “జనసేన పార్టీ స్థాపన నుంచి మహిళా సంక్షేమం, భద్రత, స్వయంసమృద్ధి కోసం పోరాటం చేస్తోంది” అని పేర్కొన్నారు. “మహిళలకు సమాన అవకాశాలు, రక్షణ, విద్యా, ఆర్థిక స్వావలంబన కల్పించేందుకు నిరంతరం కృషి చేస్తోంది,” అని చెప్పారు. “మాతృశక్తిని మరింత స్థిరపరిచేందుకు మా పార్టీ మరిన్ని బలమైన చర్యలు తీసుకుంటుందని” తెలిపారు. మహిళా సాధికారతకు అడ్డంకులు తొలగించి, వారికి సమాన హక్కులు అందించే విధంగా మనం అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. మహిళలు మెరుగైన భవిష్యత్తు కోసం స్వప్నించే హక్కు కలిగి, ఆ స్వప్నాలను సాకారం చేసుకునే అవకాశం కలిగి ఉండాలన్నారు. ఈ సందర్భంగా, ప్రతి మహిళ మరింత ధైర్యంగా, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సైన్స్ ఉపాధ్యాయురాలు జయశ్రీ, మ్యాథ్స్ ఉపాధ్యాయురాలు శశికళ తదితరులు, “సేవా దృక్పథంతో మహిళలకు వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్ చంద్రశేఖర్ సేవలను కొనియాడారు.” ఈ కార్యక్రమంలో శ్రీ భవాని హాస్పిటల్ చీఫ్ మెడికల్ అడ్మినిస్ట్రేటర్ ఎన్‌పి. దిలీప్ కుమార్, పలువురు వైద్యులు, సిబ్బంది, మరియు పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు.
Share this content:
Post Comment