రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు రామ శ్రీనివాస్ మరియు టిడిపి బీసీ సాధికార సమితి పాల ఏకరి రాష్ట్ర కన్వీనర్ గురిగింజ కుంట శివప్రసాద్ నాయుడు వారు అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటి పట్టణం భాను హరి రెసిడెన్సీలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. “తల్లిగా, భార్యగా, చెల్లిగా, కుమార్తెగా మీరు చేసే త్యాగాలు ఎంతో విలువైనవి. మీరు చూపించే ఆప్యాయత, అనురాగం, శాంతి భావం, సహనం మరియు ఓపిక కుటుంబాన్ని ఆనందంగా, శాంతిగా తీర్చిదిద్దే విలక్షణ లక్షణాలు. మీరు చేయని త్యాగం లేనిదే కుటుంబాలు సాధ్యం కాదు. మీ కృషి అనేక రంగాలలో విజయాలను సాధిస్తుంది. మీకు ఆనందం, శాంతి మరియు అభివృద్ధి కాంక్షించి, అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.” ఈ కార్యక్రమంలో రాయచోటి చిరంజీవి యువత అధ్యక్షుడు చిన్నారి జయరాం, రాయచోటి జనసేన యూత్ లీడర్ బుల్లెట్ విజయ్, జనసేన పగడాల రాజేష్, నిమ్మనపల్లె పవన్ కుమార్, శ్రీకాంత్ రెడ్డి, గురిగింజ కుంట శివకుమార్ నాయుడు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లూరు సునీతమ్మ, లక్ష్మమ్మ, సింధు, చాగలమరి లావణ్య, బండ్రే నారాయణమ్మ మరియు ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.
Share this content:
Post Comment