- కేక్ కట్ చేసిన మార్కెట్ మహిళా వ్యాపారులు
మంచిర్యాల జిల్లా మందమర్రి మార్కెట్‌లో జనసేన పార్టీ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంలో జనసేన పార్టీ ఉమ్మడి జిల్లా సీనియర్ నాయకుడు, మంథని నియోజకవర్గం ఇంచార్జి మాయ రమేష్ సమక్షంలో మహిళలు కేక్ కోసి అందరికీ పంపిణీ చేశారు. అనంతరం, మాయ రమేష్ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ, ప్రస్తుత పోటీ ప్రపంచంలో మహిళలు అన్ని రంగాల్లో దూసుకుపోతుండడం ఆనందాన్ని కలిగిస్తుందని అన్నారు. “పురుషులకు తాము తక్కువేం కాదంటూ మహిళలు ముందుకు వస్తూ ఉండడం శుభపరిణామం,” అని ఆయన కొనియాడారు. మహిళలకు ఎప్పుడైనా ఏ ఆపద వచ్చినా జనసేన పార్టీ అండగా ఉంటుందని ఆయన అభయమిచ్చారు. ఈ కార్యక్రమంలో తమ్మిశెట్టి మంజుల, బత్తుల సుజాత, పిట్టల శ్వేత, గడ్డం మాలతి, బుర్ర స్వప్న, సరిత, బైరి స్వప్న, షాహిన్, సుష్మ, రజిత, సమీరా, శ్యామల, జనసేన పార్టీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఉపాధ్యక్షులు పిట్టల సుధాకర్, మార్కెట్ వ్యాపారస్తుల అధ్యక్షులు తమ్మిశెట్టి విజయ్ కుమార్, గడ్డం అనిల్, మందమర్రి మార్కెట్ మహిళా వ్యాపారస్తులు పాల్గొన్నారు.
Share this content:
Post Comment