నిమ్స్‌లో నర్సుల పోస్టులకు ఇంటర్వ్యూలు
నిమ్స్ ఆస్పత్రిలో ఒప్పంద ప్రాతిపదికన (ఏడాది కాలపరిమితి పాటూ) పని చేసేందుకు స్టాఫ్ నర్సు పోస్టులకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్టు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ తెలిపారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు నిమ్స్ వెబ్సైట్: https://nims.edu.in/ లో సమాచారం తెలుసుకోవచ్చన్నారు. అభ్యర్థులు ఈ నెల 28న పంజాగుట్టలోని నిమ్స్ ఆస్పత్రి లెర్నింగ్ సెంటర్లో ఉదయం 11 గంటలకు జరిగే ఇంటర్వ్యూకు హాజరుకావొచ్చని పేర్కొన్నారు.