భారతీయ జనతా పార్టీ నాయకుల ఆత్మీయ సమావేశం

ఉరవకొండ, మండల కేంద్రంలోని స్థానిక వాసవి కళ్యాణమండపం నందు భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు కొనకొండ్ల రాజేష్ ఆధ్వర్యంలో సీనియర్ నాయకులు, కార్యకర్తలు, భారతీయ జనతా పార్టీ అభిమానుల మధ్య ఆత్మీయ సమావేశం నిర్వహించారు. అనంతపురం జిల్లా అధ్యక్షులు రాజేష్ మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ దేశంలో అభివృద్ధి, సంక్షేమం మెండుగా ఉన్నాయని తెలిపారు. ప్రధానమంత్రి మోడీ ఆధ్వర్యంలో దేశం ఉన్నత స్థాయిలో ఎదుగుతుంది అని కొనియాడారు. అనంతరం హైకమాండ్ జిల్లా స్థాయి, మండల స్థాయి కమిటీలు మార్చాలని ఆదేశించడంతో ప్రస్తుత మండల అధ్యక్షులైన ఎస్ వన్నూరు స్వామి పదవికాలం ముగిసిందని వన్నూరుస్వామి పడిన కష్టానికి మేము గుర్తించామని వన్నూరుస్వామిని త్వరలో జిల్లా స్థాయి క్యాడర్ కల్పిస్తామని తెలియజేసారు. అనంతరం సాధారణ కార్యకర్తగా మొదలై బెలుగుప్ప మండల అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా పూజరి మధును సీనియర్ నాయకులు ఎన్నుకోవడం జరిగింది. అనంతరం నూతన మండల అధ్యక్షులు పూజారి మధు మాట్లాడుతూ నాకు అప్పగించిన బాధ్యతలు పార్టీ సక్రమంగా నిర్వర్తిస్తానని పార్టీ నుండి ఎలాంటి లాభాపేక్ష ఆశించకుండా పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని, పార్టీ కోసం, ప్రజల కోసం అహర్నిశలు కష్టపడతానని కార్యకర్తలకు ఎల్లప్పుడు అందుబాటులో ఉంటానని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ ఎస్టీ మోర్చా జిల్లా నాయకులు వెంకటేశ్ నాయక్, సీనియర్ నాయకులు మాజీ అధ్యక్షులు వన్నూరు స్వామి, జేష్ట నాయకులు మనోహర్, జి. సుంకన్న, రామలింగ, గోబ్రియా నాయక్, తునకల వెంకటేష్,అభి, రాజేష్, గోపాల్, మరియు కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

Share this content:

Post Comment