కాటకోటేశ్వరంలో జనంలోకి – జనసేన

నిడదవోలు నియోజకవర్గం, నిడదవోలు మండలం, కాటకోటేశ్వరం గ్రామంలో జనసేన పార్టీ నిడదవోలు మండల అధ్యక్షులు పోలిరెడ్డి వెంకటరత్నం ఆధ్వర్యంలో జనంలోకి – జనసేన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తాడేపల్లిగూడెం నియోజకవర్గ జనసేనపార్టీ ఇంచార్జ్ బొలిశెట్టి శ్రీనివాస్ హాజరు అవ్వడం జరిగింది.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి ప్రియా సౌజన్య, పెరవలి మండల నాయకులు పిప్పర రవి, పెండ్యాల ఎంపీటీసీ ఇంద్రా గౌడ్, జిల్లా కార్యదర్శి తులా చినబాబు, సంయుక్త కార్యదర్శి కాకర్ల నాని, ఉరుసు సౌజన్య, జిల్లా ప్రోగ్రాం కమిటీ సత్తిబాబు, మూర్తి, కాశీ, అలాగే కార్యక్రమం విజయవంతంగా మందుకు తీసుకువెళ్లిన కాటకోటేశ్వరం, జనసేన నాయకులు కస్తూరి సుబ్బారావు, ఉప్పులూరి వాసు, ఉల్లి రమేష్, బండారు బాబీ, కొప్పిశెట్టి మంగరాజు, చౌటుపల్లి స్వామి, పారేపల్లి వెంకటేష్, నియోజకవర్గ నాయకులు నార్ని తాతాజీ, శివ సాయి పాల్గొన్నారు.