వీరబల్లి మండలం సానిపాయి గ్రామపంచాయతీ నిధుల దుర్వినియోగంపై నేతి రమేష్, నేతి రామ్మోహన్, గుగ్గిల వెంకటేష్ పై అధికారులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ రోజు సానిపాయ గ్రామంలో పంచాయతీ నిధుల దుర్వినియోగంపై కడప డివిజన్ విజిలెన్స్ డిఈ జోకభ్ ఫాల్ మరియు జేఈ విశ్వనాథన్ గారు వచ్చి రికార్డులను పరిశీలించారు. ప్రతి ఎంట్రీ నమోదుపై క్షుణ్ణంగా పరిశీలించి, ప్రతి ఒక్క ఎంట్రీని నమోదు చేసుకొని పూర్తి నివేదికలను పై అధికారులకు సమర్పిస్తామని తెలియజేశారు. ఈ విచారణలో పూర్వపు వీరబల్లి మండలం ఆర్డబ్ల్యూఎస్ ఏఈ కృష్ణయ్య, పంచాయతీ సెక్రెటరీ లంక చంద్రుడు హాజరయ్యారు. పై అధికారుల ఆదేశానుసారం వీరబల్లి సబ్ ఇన్స్పెక్టర్ వారు వారి సిబ్బందితో ఎటువంటి అవాంఛనీయ ఘటన జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది.

Share this content:
Post Comment