ఐపీఎల్ 2020 : టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న చెన్నై

ఐపీఎల్‌ 2020లో మరో సూపర్ ఫైట్‌ కొనసాగుతోంది. ఈ రోజు దుబాయ్‌ వేదికగా జరుగుతున్న మ్యాచ్ లో సన్‌రైజర్స్ హైదరాబాద్-చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరుగుతుంది. అయితే ఇందులో టాస్ గెలిచిన చెన్నై బ్యాటింగ్ ఎంచుకోవడంతో హైదరాబాద్ మొదట బౌలింగ్ చేయనుంది. అయితే ఈ ఏడాది ఐపీఎల్ లో ఈ రెండు జట్లు తలపడటం ఇది రెండోసారి. మొదటిసారి సన్‌రైజర్స్ విజయం సాధించింది. ఇక ఐపీఎల్ 2020 లో తమ స్థాయి ప్రదర్శన చేయని చెన్నై ఈ మ్యాచ్ లో సన్‌రైజర్స్ ను ఓడించగలదా అనే అనుమానం అందరిలోనూ ఉంది. ఇక గత మ్యాచ్ లో ఓటమి చవిచూసిన హైదరాబాద్ ఈ మ్యాచ్ లో ఎలాగైనా విజయం సాధించాలని చూస్తుంది. మరి ఈ మ్యాచ్ లో ఏ జట్టు విజయం సాధిస్తుంది అనేది చూడాలి.