ఐపీఎల్ 2021: చెన్నై ముందు స్వల్ప లక్ష్యం 107 పరుగులు ..

పంజాబ్ కింగ్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్న చెన్నై సూపర్ కింగ్స్ ప్రత్యర్థి జట్టును బాగానే కట్టడి చేసింది. ఆ స్టార్ యువ పేసర్ దీపక్ చాహర్ పంజాబ్ ను కోలుకోలేని దెబ్బ కొట్టాడు. వేసిన నాలుగు ఓవర్లలో పంజాబ్ జట్టు ముఖ్యమైన నలుగురు ఆటగాళ్లను పెవిలియన్ కు చేర్చాడు. ఇక ఆ జట్టు కెప్టెన్ రాహుల్ కూడా జడేజా అద్భుతమైన ఫిల్డింగ్ కారణంగా రన్ ఔట్ గా వెనుదిరిగాడు. కానీ పంజాబ్ జట్టు యువ ఆటగాడు షారుఖ్ ఖాన్ కారణంగా ఆ జట్టు 100 పరుగులను దాటింది. ఆటగాళ్లు అందరూ వరుసగా ఔట్ అవుతున్న చెన్నై బౌలర్లను ధీటుగా ఎదుర్కొని 47 పరుగులు చేసిన షారుఖ్ చివరి ఓవర్ మొదటి బంతికి పెవిలియన్ చేరుకున్నాడు. దాంతో ఆ జట్టు నిర్ణిత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 106 పరుగులు చేసింది. ఇక చెన్నై బౌలర్లలో చాహర్ 4 వికెట్లు తీయగా మొయిన్ అలీ, సామ్ కర్రన్, డ్వేన్ బ్రావో ఒక్కో వికెట్ తీశారు. ఇక ఈ మ్యాచ్ లో చెన్నై గెలవాలంటే కేవలం 107 పరుగులు చేస్తే చాలు.