ఏపీలో భారీగా ఐపీఎస్ బదిలీలు

ఏపీలో భారీగా ఐపీఎస్ బదిలీలు అయ్యారు. విజయనగరం, నెల్లూరు, తూ.గో, కృష్ణా జిల్లాల ఎస్పీల బదిలీలు అయ్యారు. పదోన్నతిపై దిశ డీఐజీగా బి. రాజకుమారి నియామకం కాగా. విజయనగరం ఎస్పీగా ఎం.దీపిక బదిలీ అయ్యారు. అలాగే నెల్లూరు ఎస్పీగా సీహెచ్. విజయా రావు. తూ.గో. ఎస్పీగా రవీంద్రనాథ్‌ బాబు నియామకం అయ్యారు. కృష్ణా ఎస్పీగా సిద్దార్థ కౌశల్ బదిలీ కాగా. గ్రేహౌండ్స్ గ్రూప్ కమాండరుగా అద్నాన్ నయీమ్ అస్మి నియామకం అయ్యారు.

గుంటూరు రూరల్ ఏఎస్పీ అడ్మినుగా రిషంత్‌రెడ్డి నియామకం కాగా. సెబ్ ఏఎస్పీలుగా ఎస్. సతీష్‌ కుమార్, విద్యా సాగర్‌ నాయుడు బదిలీ అయ్యారు. సెబ్ అసిస్టెంట్ ఎస్పీలుగా బిందుమాధవ్, తుహిన్‌ సిన్హా లు బదిలీ అయ్యారు. అలాగే.. పాడేరు అసిస్టెంట్ ఎస్పీగా పి.జగదీష్ బదిలీ కాగా..

నర్సీపట్నం అసిస్టెంట్ ఎస్పీగా వీ ఎన్. మణి కంఠ చంధోలు బదిలీ కాగా.రంపచోడవరం అసిస్టెంట్ ఎస్పీగా కృష్ణ కాంత్ పటేల్ బదిలీ అయ్యారు. చింతపల్లి అసిస్టెంట్ ఎస్పీగా తుషార్ డూడి బదిలీ అయ్యారు. ఈ బదిలీల్లో ఐపీఎస్ అమ్మిరెడ్డి పోస్టింగ్‌ దక్కించుకోలేకపోయారు.