*గెడ్డం బుజ్జి నాయకత్వంలో జనసేన హామీకి నిబద్ధత
గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు నక్కపల్లి మండలం ఉద్దండపురం గ్రామంలో ఊరి చివర సాగునీటి కాలువ నిర్మాణానికి జనసేన పార్టీ ఇంచార్జ్ గెడ్డం బుజ్జి తన సొంత ఖర్చులతో ప్రారంభం చేశారు. ఈ కార్యక్రమాన్ని సాగునీటి కాలువ చైర్మన్ గెడ్డం చైతన్య పర్యవేక్షించారు. ఈ ప్రారంభోత్సవంలో గెడ్డం కన్నబాబు, తోట నాగేశ్, యగదాసు నానాజీ, వెలగా సుధాకర్, నల్లల రత్నజి, ఆచంట దోర, యర్ల వరహాలురావు, చించలపు పొద్దు, దేవరవరుపు సత్యనారాయణ, పల్లి దుర్గారావు, పొడకట్ల పాపారావు, వొబోయిన రమణ, పల్ల బాబురావు, కర్రి బాబురావు సహా పలువురు టిడిపి-జనసేన నేతలు, కాలువ డైరెక్టర్లు, స్థానిక గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
Share this content:
Post Comment