అసలు మన రాష్ట్రంలో ఏ స్థాయి లేక బెంగళూరు ప్యాలెస్ లో తలదాచుకుంటూ నాకు ప్రతిపక్ష స్థాయి ఇవ్వాలని హైకోర్టు మెట్లు ఎక్కిన జగన్ రెడ్డి మా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ని తూలనాడుతూ మాట్లాడడం జగన్ రెడ్డి అహంకారాన్ని ప్రజలకు తెలుపుతోంది. అసలు ఎవరి స్థాయి ఏంటి అనేది ప్రజలు తెలుసుకున్నారు కాబట్టి మిమ్మల్ని ఏ స్థాయిలో పెట్టాలో నిర్ణయం తీసుకున్నారు. అసలు జగన్ రెడ్డికి ఏమన్నా బుర్ర ఉందా కొద్దిగా అని ఆంధ్ర రాష్ట్ర ప్రజల ఆలోచిస్తున్నారు. సొంతంగా జనసేన పార్టీని నిర్మించుకున్న స్థాయి పవన్ కళ్యాణ్ ది. ఇతరులు శివకుమార్ అనే వ్యక్తి నిర్మించిన వైయస్సార్ సిపి పార్టీని కబ్జా చేసుకున్న స్థాయి జగన్ రెడ్డిది. అసలు ఏ పదవి లేకుండా 10 సంవత్సరములు పార్టీని నడిపి ప్రజల ఆదరణ పొంది పోటీ చేసిన అన్నిచోట్ల గెలిచి 100% స్ట్రైక్ రేట్ తో మన భారతదేశంలోనే ఏ పార్టీ కూడా సాధించని విజయాన్ని నెలకొలిపిన స్థాయి మా పవన్ కళ్యాణ్ ది. తండ్రి శవం ముందర ఉండగా పదవులకు పాకులాడిన స్థాయి మీది. తండ్రి మరణం బాబాయ్ హత్య ఇతర వలస నాయకులతో అధికారం తెచ్చుకున్న స్థాయి జగన్ రెడ్డిది. తన సొంత సంపాదనను ప్రజలకు ఆపద వచ్చినప్పుడల్ల ఉద్దానమైతేనేమి, కరోనా అయితేనేమి, కౌలు రైతుల కష్టాలైతేనేమి తన వంతుగా సాయం చేసిన స్థాయి పవన్ కళ్యాణ్ ది. తండ్రి పదవిని అడ్డం పెట్టుకొని కొంత మరల తాను ప్రజలను ఏమార్చి అధికారంలోకొచ్చి ప్రజల ఆస్తిని దోచుకునీ 33 కేసులతో ఆర్థికనేరాలు ఉన్న నేరగాళ్లస్థాయి జగన్ రెడ్డిది. ప్రజలు ఒక్క ఛాన్స్ అంటే అవకాశం ఇస్తే మన రాష్ట్రంకు రాజధాని లేకుండా చేశావు. ప్రాజెక్టుల నిర్మాణం జరగలేదు. ఉద్యోగస్తులకు మేలు జరగలేదు. యువతకు ఉద్యోగాలు లేవు. రైతులకు వ్యవసాయ సహకారం లేదు కనీసం ఒక్క మీటర్ డ్రిప్ పైపు కూడా ఇవ్వలేని స్థాయి జగన్ రెడ్డిది. యువతతో గంజాయి వ్యాపారం చేయించిన స్థాయి జగన్ రెడ్డిది. రెవిన్యూ వ్యవస్థ నైతేనేమీ పోలీసు వ్యవస్థను అయితే నేమి విద్యావ్యవస్థ నైతేనేమీ ఆరోగ్య వ్యవస్థ నైతేనేమే అన్నింటిని సర్వనాశనం చేసిన స్థాయి జగన్ రెడ్డిది. ఫ్యాక్షన్ రాజకీయాలు, ప్రజాధనం దోపిడీ, హత్య రాజకీయాలు ఇవి జగన్ రెడ్డి స్థాయి. యువతను ప్రజాసేవకు ఉపయోగించుకుంటూ వారి యొక్క ఔన్నత్యాన్ని జనసేన పార్టీ ద్వారా ప్రజలకు దేశానికి తెలిపేస్థాయి పవన్ కళ్యాణ్ ది. అసలు లక్షల కోట్ల అధిపతి అయిన మీరు రాజకీయంలోకి రాకముందు గానీ రాజకీయంలో వచ్చిన తర్వాత గాని పిల్లికి బిక్షం కూడా వేయని మీరు స్థాయిల గురించి మాట్లాడుతుంటే… ప్రజల సొమ్మును ప్రజలకు పావలా ఇచ్చి ముప్పావల కాజేసిన మీరు కూడా మా పవన్ కళ్యాణ్ ని తూలనాడటం ఎలా ఉందంటే ఏనుగు వెళుతుంటే కుక్కలు మొరుగుతాయి అన్న రీతిలో ఉందంటూ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నవ్వుకుంటున్నారని జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి చొప్పా చంద్రశేఖర్ పత్రికా ముఖంగా తెలపడం జరిగింది.
Share this content:
Post Comment