స్వామి సమర్థుడా? అసమర్ధుడా?.. డాక్టర్ యుగంధర్ పొన్న

  • సమర్ధుడు వైతే రోడ్డు వెడల్పు చెయ్
  • అసమర్ధుడు అయితే తొలగిపో
  • సరికొత్త జనసేన ప్రభుత్వంలో రోడ్లు వేస్తాం
  • వెదురుకుప్పాన్ని తిరుపతి జిల్లాలో కలుపుతాం, కార్వేటి నగరాన్ని తిరుపతి జిల్లాలో కలుపుతాం
  • తుడా పరిధిలో ఉంటే న్యాయం, తిరుపతి జిల్లాలో ఉండకపోతే అన్యాయమా?
  • తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డ జనసేన ఇంచార్జ్ డాక్టర్ యుగంధర్ పొన్న

గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో వెదురుకుప్పం నుండి మొరవ వరకు మూడవరోజు పాదయాత్ర నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ యుగంధర్ పొన్న మాట్లాడుతూ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి సమర్ధుడా? అసమర్ధుడా?
అని వంగ్యస్త్రాలు సంధించారు. నువ్వు సమర్ధుడు అయితే కార్వేటినగరం నుంచి వెదురుకుప్పం మీదుగా కొత్తపల్లి మిట్ట వరకు రోడ్డు వెడల్పు చెయ్. అసమర్థుడవైతే ప్రభుత్వం నుంచి తొలగిపో అని హెచ్చరించారు. ఎమ్మెల్యేగా గెలిచావు రెండుసార్లు,మంత్రిగా ఒకసారి, ఉప ముఖ్యమంత్రిగా ఒకసారి నియోజకవర్గ ప్రజల కోసం రోడ్డును వెడల్పు చేయలేవా? నీ కర్మకు నువ్వే బాధ్యుడవు, నువ్వే ఈ రోడ్డును వెడల్పు చేయాలి. ఎందుకంటే ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యే నువ్వే, తప్పదు, ఈ నియోజకవర్గానికి చివరి వైసీపీ ఎమ్మెల్యే కూడా నువ్వే, జనసేన ప్రభుత్వం వచ్చిన తర్వాత వెదురుకుప్పం మండలాన్ని, కార్వేటినగరం మండలాన్ని తిరుపతి జిల్లాలో కలిపి తీరుతామని ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో వెదురుకుప్ప మండల అధ్యక్షులు పురుషోత్తం, ఉపాధ్యక్షులు సతీష్, ప్రధాన కార్యదర్శి రజని, కార్యదర్శి ముని, పార్టీ సీనియర్ నాయకులు యతీశ్వర్ రెడ్డి, పాలసముద్రం మండల అధ్యక్షులు లతీష్, కార్వేటినగరం మండల అధ్యక్షులు శోభన్ బాబు, ప్రధాన కార్యదర్శిల వెంకటేష్ హరీష్, నరేష్, సోమశేఖర్, కార్యదర్శి నవీన్, వీరమహిళ మీనా, గంగాధర నెల్లూరు మండల ఉపాధ్యక్షులు వెంకటాద్రి, ప్రధాన కార్యదర్శి శివయ్య, జిల్లా సంయుక్త కార్యదర్శి రాఘవ, జిల్లా కార్యనిర్వాహక కమిటీ సభ్యులు భానుచంద్రారెడ్డి, నియోజకవర్గ మీడియా కోఆర్డినేటర్ చంద్రమౌళి మరియు జన సైనికులు అజయ్, శరత్, శంకర్, భాస్కర్, కార్తీక్, ప్రసాద్, సూర్య, ముని, ముత్తు, రామ్మూర్తి, మరియు ప్రజలు పాల్గొన్నారు.