నాడు – నేడు వైసిపి నాయకుల సంపాదనకా..? రేపటి బిడ్డల భవిష్యత్తుకా..?: గునుకుల కిషోర్

  • నాడు నేడు పేరుతో స్కూళ్ళ కి రంగులు వేస్తే చాలా … చదువులు చెప్పే ఉపాధ్యాయులు అక్కర్లేదా..?

నెల్లూరు: కాంట్రాక్టుల పేరుతో లక్షలు వెనకేసుకుంటున్న వై సి పి నాయకులు ఉపాధ్యాయులకు కనీసం వేతనాలు చెల్లించలేకున్నారా..? అంటూ జనసేన ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ ఆధ్వర్యంలో నెల్లూరు రూరల్ కందమూరు లోని ఎస్సీ కాలనీ ఎం పి పి విద్యార్థులు కోరుతున్నారు. గత ఒకటిన్నర సంవత్స రాలుగా పాఠశాలలో విద్యను బోధించేందుకు ఉపాధ్యాయులు లేరని, స్థానిక యువకులే పిల్లలకు పాఠాలు నేర్పిస్తున్నారు. స్థానిక జనసేన కార్యకర్తల సమాచారం మేరకు అక్కడకు వెళ్లిన గునుకుల కిషోర్ పిల్లలను భోజనం వసతుల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ఆరు నెలలుగా స్థానికులు ఎంత చెప్పినా కూడా ప్రభుత్వ అధికారులు పట్టించుకోవడంలేని విద్యను బోధించడానికి ఉపాధ్యాయులను సమకూర్చడం లేదు. నాడు నేడు పేరుతో లక్షల సంపాదిస్తున్న వైసిపి నాయకులు ఒక ఉపాధ్యాయుని పెట్టి పిల్లకు విద్య కల్పించలేకపోయారు. రాష్ట్రాన్ని ప్రగతిపధంలో ఉరకలు వేయిస్తామని గొప్పలు చెప్పుకుంటున్న వైసీపీ ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో కనీస విద్యను కూడా అందించలేక ఉంది. ఈ విషయమై డీఈఓ గారిని కలెక్టర్ గారిని సంప్రదించి ఫిర్యాదును ఇస్తాము. అప్పటికి స్పందించకపోతే కందమూరు నుంచి కాలినడకన వచ్చి కలెక్టర్ గారికి అర్జీ ఇస్తామని గునుకుల కిషోర్ తెలిపారు. పిల్లలకి విద్య నేర్పించడం ప్రాథమిక హక్కు ఈ విషయాన్ని విస్మరించిన వైసిపి ప్రభుత్వానికి బుద్ధి చెప్పాల్సిన పరిస్థితి ఉంది. జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు ప్రజలకు ఉచిత విద్య వైద్య సౌకర్యాలు సమకూర్చినప్పుడు అభివృద్ధి అనేది దానంతట అదే వస్తుంది అని జనసేన ప్రభుత్వం ఏర్పడితే నాణ్యమైన విద్య వైద్య సౌకర్యాలు ఉచితంగా ప్రభుత్వం తరఫున కల్పిస్తామని చెప్పడం జరిగింది. ఈ సారి ప్రజా ప్రభుత్వం జనసేన పార్టీకి అవకాశం ఇచ్చి పవన్ కళ్యాణ్ గారిని గెలిపించవలసిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ తో పాటు స్థానికులు ప్రసాద్, మస్తాన్, జనసేన నాయకులు పాల్గొన్నారు.