వైసీపీ పాలనలో ప్రజల సమస్యలు చెప్పుకునే అవకాశం కూడా లేదా?

  • ముఖ్యమంత్రికి వినతిపత్రం ఇవ్వడం తప్పా?
  • మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా? నియంత పాలనలో ఉన్నామా?
  • ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా ముందస్తు అరెస్టు చేసిన వెంకటాచలం పోలీసులు
  • ముఖ్యమంత్రిని కలిసి వినతిపత్రాన్ని ఇవ్వనివ్వకుండా అడ్డుకొని నన్ను వెంకటాచలం పోలీస్ స్టేషన్ లో నిర్బంధించిన నా పోరాటం ఆగదు
  • మంగళవారం అంతటా పోలీస్ స్టేషన్ లో నిర్బంధించి వదిలిన వెంకటాచలం పోలీసులు
  • సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు బొబ్బేపల్లి సురేష్ నాయుడు

సర్వేపల్లి నియోజకవర్గం, జనసేన నాయకులను నిర్బంధించిన సందర్భంగా బొబ్బేపల్లి సురేష్ నాయుడు మాట్లాడుతూ ముఖ్యమంత్రి పర్యటనకు వస్తే ఆ ప్రాంతంలో ప్రతిపక్ష పార్టీల నాయకులు గాని, సమస్యల మీద పోరాటం చేస్తున్న ఉద్యమకారులు గాని ఎవ్వరూ ఇళ్లలో ఉండకూడదా? అంతా పోలీసు కస్టడీలోనే ఉండాలా? ఇదెక్కడి అన్యాయం? అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అనేది ఉందా? వైసీపీ పాలనలో అడుగడుగునా అన్ని వర్గాల ప్రజలు సమస్యలతో సతమతమవుతున్నారు. ఎక్కడా కనీస మౌలిక వసతులు లేవు. పాలకులు పట్టించుకోరు. అధికారులు పని చేయరు. తాడేపల్లి ప్యాలెస్ వీడి అడపాతడపా బయటికి వస్తున్న ముఖ్యమంత్రిని కలసి ఆ ప్రాంత ప్రజలు తమ సమస్యలు చెప్పుకుందామన్నా, కనీసం వినతిపత్రాలు సమర్పిద్దామన్నా అవకాశం లేకుండా చేస్తున్నారు. ఇదేం పాలన. ముఖ్యమంత్రి ఎదుట నిరసన తెలిపితే తప్పు. వినతిపత్రం ఇవ్వడం కూడా తప్పేనా? దేశంలో ఎక్కడైనా ఇలాంటి పాలన ఉందా? ఆంధ్రప్రదేశ్ లో నియంతపాలన సాగుతోంది. రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు. సర్వేపల్లి నియోజకవర్గంలో కృష్ణపట్నం పోర్టు కట్టారు. అదానీలకు అమ్మేసుకున్నారు. ఇప్పటి వరకు నిర్వాసితులకు పూర్తి స్థాయి న్యాయం దక్కింది లేదు. యడిబుల్ ఆయిల్ కంపెనీల అరాచకాలు అంతా ఇంతా కాదు. థర్మల్ పవర్ ప్లాంట్ల దూళితో బాధ, ఇప్పుడు దాన్ని ప్రైవేటీకరణ అంటున్నారు. గ్రావెల్ దోచేస్తున్నారు. నియోజకవర్గంలో మొత్తం గుంతల మధ్యే రోడ్లు ఉన్న దుస్థితి. తాగునీటి సమస్యలు ఉన్నాయి. ప్రధాన సమస్యల మీద ముఖ్యమంత్రికి వినతిపత్రం సమర్పిద్దామంటే తెల్లవారకముందే పోలీసులు వచ్చి ఇంటి తలుపు కొట్టారు. బలవంతంగా పోలీస్ స్టేషన్ తీసుకువెళ్లారు, నాతో పాటు జనసేన పార్టీ నాయకులు చాలా మందిని పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పారు. ఇదేం సంస్కృతి. గతంలో ఎన్నడూ ఈ పరిస్థితి లేదు. ప్రభుత్వ నియంతృత్వ ధోరణులకు సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. మీరు ఎంత అణగదొక్కాలని చూస్తే అంత లేస్తాం. ప్రజా సమస్యల మీద జనసేన పార్టీ పోరాటం ఆపదని హెచ్చరించారు.