‘ఇష్క్’ ట్రైలర్: ఇది ప్రేమ కథ మాత్రమే కాదు..!

తేజ సజ్జా, ప్రియా ప్రకాశ్ వారియర్ జంటగా నటించిన తాజా చిత్రం “ఇష్క్”. ‘నాట్ ఎ లవ్ స్టోరీ’ అనేది ట్యాగ్ లైన్. మలయాళంలో విజయం సాధించిన ‘ఇష్క్’ చిత్రాన్ని అదే పేరుతో తెలుగులో రీమేక్ చేస్తోంది మెగా సూపర్ గుడ్ ఫిలిమ్స్ సంస్థ. యస్.యస్. రాజు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ఎన్వీ ప్రసాద్, పారస్ జైన్, వాకాడ అంజన్ కుమార్ నిర్మించారు. ఆర్.బి. చౌదరి ఈ మూవీకి సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. మహతి స్వర సాగర్ సంగీతాన్ని అందించగా, శ్యామ్ కె నాయుడు సినిటోగ్రాఫర్ గా చేశారు. ఈ చిత్రాన్ని ఇదే నెల 23న విడుదల చేయబోతున్నట్టు ఉగాది సందర్భంగా ప్రకటించారు. తాజాగా ఈ చిత్రం నుంచి ట్రైలర్ ను విడుదల చేశారు మేకర్స్. 1 నిమిషం 30 సెకన్లు ఉన్న ఈ ట్రైలర్ లో ముందుగా హీరోహీరోయిన్ల లవ్ స్టోరీ చూపించారు. హీరోహీరోయిన్ కారులో బీచ్ రోడ్ లో వెళ్తుండగా ఏం జరిగిందనే విషయాన్నీ సస్పెన్స్ లో ఉంచి ఆసక్తిని రేకెత్తించారు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. మొత్తం మీద ట్యాగ్ లైన్ సూచించినట్లు ఇది ప్రేమ కథ మాత్రమే కాదని ట్రైలర్ ద్వారా తెలుస్తోంది.. మీరు కూడా ‘ఇష్క్’ ట్రైలర్ ను వీక్షించండి.