పరిశుభ్రత, నాణ్యతలో మేటి.. శ్రీకాళహస్తి ఆలయానికి ఐఎస్ఓ గుర్తింపు

చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి ఆలయానికి ఐఎస్ఓ గుర్తింపు లభించింది. పరిశుభ్రత, నాణ్యత విషయంలో మేటిగా నిలిచినందుకు ఈ గుర్తింపు దక్కింది. హెచ్‌వైఎం సంస్థ ప్రతినిధి శివయ్య, ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డి కలిసి ఆలయ ఈవో పెద్దిరాజుకు నిన్న ఆలయ ఆవరణలో ఐఎస్ఓ ధ్రువీకరణ పత్రాన్ని అందజేశారు.

ఈ సందర్భంగా హెచ్‌వైఎం ప్రతినిధి శివయ్య మాట్లాడుతూ.. ఆలయంలో నిర్వహించే అన్నదాన పథకంలో నాణ్యతకు, అతిథి గృహాల నిర్వహణలో శుభ్రతను పరిశీలించిన అనంతరం ఐఎస్ఓ ధ్రువీకరణ పత్రం అందించినట్టు చెప్పారు. శ్రీకాళహస్తీశ్వరుని ఆలయానికి ఐఎస్ఓ గుర్తింపు లభించడంపై భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.