ఏపీలో టెన్త్‌ పాసైన విద్యార్ధులకు ఆన్ లైన్లో మైగ్రేషన్ సర్టిఫికెట్ల జారీ

ఏపీలో 2020-21 ఏడాదికిగాను పదో తరగతి ఉత్తీర్ణులైన వారికి ఆన్ లైన్ లో మైగ్రేషన్ సర్టిఫికెట్లు జారీ చేస్తున్నట్టు రాష్ట్ర విద్యాశాఖ వెల్లడించింది. అందుకోసం విద్యార్థులు రూ.80 చెల్లించాల్సి ఉంటుంది. మైగ్రేషన్ సర్టిఫికెట్ కోసం bse.ap.gov.in వెబ్ సైట్ నుంచి దరఖాస్తు చేసుకోవాలని విద్యాశాఖ పేర్కొంది.

ఆన్ లైన్ లో దరఖాస్తు ప్రక్రియ రేపటి నుంచి అందుబాటులోకి వస్తుందని తెలిపింది. అంతేకాదు, 2004 తర్వాత టెన్త్ పాసైన వారు కూడా మైగ్రేషన్ సర్టిఫికెట్ కోసం ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చని విద్యాశాఖ వివరించింది. ఈ ఏడాది కరోనా వ్యాప్తి కారణంగా పదో తరగతి విద్యార్థులకు పరీక్షలు లేకుండానే ఉత్తీర్ణత ప్రకటించడం తెలిసిందే.